Goppadi Raa Manishi Puttuka Lyrical - Tholu Bommalata

గొప్పదిరా మనిషి పుట్టుక – హార్ట్ టచింగ్ సాంగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘తోలుబొమ్మలాట’.. చిత్రం నుంచి ‘గొప్పదిరా మనిషి పుట్టుక’ అనే పాట విడుదల చేశారు..

నటకిరీటి డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా.. ‘తోలుబొమ్మలాట’.. ఐశ్వర్య మాగంటి సమర్పణలో, సుమ దుర్గా క్రియేషన్స్ బ్యానర్‌పై.. మాగంటి దుర్గా ప్రసాద్ నిర్మిస్తుండగా.. విశ్వనాధ్ మాగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత, విశ్వంత్, వెన్నెల కిషోర్, ధనరాజ్, నర్రా శ్రీను, దేవీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

కనుమరుగైపోతున్న మానవ సంబంధాల యెుక్క గొప్పతనాన్ని తెలిపేలా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ‘గొప్పదిరా మనిషి పుట్టుక’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. సురేష్ బొబ్బిలి ట్యూన్ కంపోజ్ చేయగా, చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాసారు. విజయ్ యేసుదాస్ చాలా బాగా పాడారు. ‘జీవితమింతే నవ్వూ ఏడ్పు.. సాగే తోలూ బొమ్మలాట’ అంటూ జీవిత సారాంశాన్ని అద్భుతంగా ఈ పాటలో చెప్పారు..

Read Also : ‘సామజవరగమన’ మలయాళం సాంగ్ విన్నారా!

రాజేంద్ర ప్రసాద్ సోమరాజు అలియాస్ సోడాల్రాజు పాత్రలో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. ‘తోలుబొమ్మలాట’ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం : సురేష్ బొబ్బిలి, కెమెరా : సతీష్ ముత్యాల, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు.
 

Related Posts