government give chance for online arjita sevalu for devotees

ఇక ఆన్ లైన్ లోనే ఆర్జిత సేవలు, ఇంటికే రాములోరి కళ్యాణ తలంబ్రాలు.. లాక్ డౌన్ వేళ భక్తులకు ప్రభుత్వం శుభవార్త

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అన్ని రకాల వ్యాపారాలు, దుకాణాలు మూతబడ్డాయి. దేవాలయాల్లో దర్శనాలు సైతం నిలిపేశారు. ఆలయాల్లో నిత్య హారతి, పూజలు జరుగుతున్నా దర్శనాలు మాత్రం లేవు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, కాశీ లాంటి వాటికి కూడా దర్శనాలు పూర్తిగా నిలిపేశారు. స్వామి వారి దర్శనానికి నోచుకోక కొందరు భక్తులు మానసిక వేదనకు గురవుతున్నారు. అలాంటి వారికి తెలంగాణ దేవాదాయ శాఖ శుభవార్త వినిపించింది. వారికి కొంత రిలిఫ్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది.

భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారి పేరిట పూజలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను(T App Folio) గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ఇక ఆన్ లైన్ లోనే ఇష్టమైన దైవానికి అర్చనలు, ఆర్జిత సేవలు చేసుకోవచ్చు. అంతేకాదు భద్రాద్రి రాములోరి కళ్యాణ తలంబ్రాలు నేరుగా ఇంటికే వస్తాయి.(ట్రాఫిక్‌ పోలీసుకు కరోనా పాజిటివ్‌)

ఉజ్జయిని, కర్మన్‌ఘాట్‌ ఆలయాల్లో నేటి నుంచే అమల్లోకి:
తొలి దశలో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్‌ఘాట్‌లోని ధ్యానాంజనేయస్వామి ఆలయంలో పూజలు ప్రయోగాత్మకంగా నేటి(ఏప్రిల్ 8,2020) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో పాల్గొనే వారు ముందుగా ప్లే స్టోర్ నుంచి ‘టీ యాప్ ఫోలియో’ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో ఆలయాల వివరాలు చూసి, అందులో కావాల్సిన ఆర్జిత సేవను ఓపెన్ చేసి, వివరాలు నమోదు చేసుకుంటే చాలు. భక్తులు కోరిన రోజున ఆ పూజలు నిర్వహిస్తారు. పూజల తరువాత అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్ తో కూడిన ప్రసాదాన్ని అందించాలని తొలుత భావించినా, తపాలా, కొరియర్‌ సేవలు పరిమితంగా ఉన్నందున ప్రస్తుతం ఇది సాధ్యం కాదని అధికారులు అంచనాకు వచ్చారు.

ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు:
ఇక భక్తులు భద్రాద్రి రామయ్య కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించలేకపోయినా, కల్యాణ తలంబ్రాలను ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ఇందుకు గాను రూ. 30 పోస్టల్ చార్జి, తలంబ్రాల కోసం రూ. 20, సర్వీస్ చార్జ్ లను చెల్లించాల్సి ఉంటుంది. తపాలా శాఖ ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరుస్తుంది. ఇందుకోసం ఐదు వేల తలంబ్రాల పొట్లాలను దేవాదాయశాఖ సిద్ధం చేసింది. తపాలాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో భద్రాచలం దేవాలయం తలంబ్రాల వివరాలు ఉన్న విండో ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు తపాలాశాఖ సిబ్బంది,   వాహనాలను సిద్ధం చేసింది.

READ  తెలంగాణ బడ్జెట్ : ప్రతీ గ్రామానికి రూ.8 లక్షలు

ఇలా బుక్‌ చేసుకోవాలి:
* గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి టీఎస్‌ యాప్‌ ఫోలియోను(T App Folio) డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
* అందులో దేవాలయాల వివరాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సిన ఆలయంలో ఆర్జిత సేవను ఓపెన్‌ చేసి వివరాలు నమోదు చేయాలి. 
* దాని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో, వారు కోరుకున్న రోజున ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. 
* ఆ వివరాలను తిరిగి వారి మొబైల్‌ ఫోన్‌కు సమాచారం రూపంలో అందిస్తారు. 
* కుదిరితే పూజ అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్, మిశ్రీతో కూడిన ప్రసాదాన్ని కూడా అందించాలని తొలుత భావించారు. 
* కానీ ప్రస్తుతం తపాలా, కొరియర్‌ సేవలు పరిమితంగానే ఉన్నందున ఇది సాధ్యం కాదని అనుకుంటున్నారు.

Related Posts