లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

ఇండియాలో డిసెంబర్ నాటికి మొదటి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి!

Published

on

Covid-19 Vaccine : ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ 2020 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అనుకున్నట్టుగా క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే డిసెంబర్‌ నాటికి Covid-19 వ్యాక్సిన్ అమ్మకానికి సిద్ధంగా ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోందని సీనియర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.‘కరోనా వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చెప్పడం చాలా కష్టం. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు, వ్యాక్సిన్లకు రెగ్యులేటరీ ఎప్పుడు ఆమోదిస్తుందో అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

కానీ, డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో వ్యాక్సిన్ వస్తుందని భావిస్తున్నాం’ అని పేరు చెప్పేందుకు అంగీకరించని అధికారి వెల్లడించారు.ఇండియాలో జరిగే కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో Serum Institute of India ముందుంజలో ఉంది. ప్రస్తుతం Covidshieldకు సంబంధించి మడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

UK’s AstraZeneca, University of Oxford సంయుక్తంగా ఈ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి.

మరోవైపు Bharat Biotech International Ltd, Zydus Cadila ఇతర కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.

2021 ఏడాది ప్రారంభంలో వీరి కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతం రెండో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

అన్ని మూడు హ్యుమన్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయిన వెంటనే Drug Controller General of India ఆమోదం పొందాల్సి ఉంటుంది.అయితే కరోనా వ్యాక్సిన్లపై ప్రభుత్వం అంచనాలు అవాస్తవమని నిపుణులు అంటున్నారు.

ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏ కరోనా వ్యాక్సిన్లు సిద్ధం కావాని భావిస్తున్నామని పూణెలోని Indian the Institute of Science Education and Research బయాలజీ ప్రొఫెసర్ వినీత్ బాల్ అభిప్రాయపడ్డారు.

‘రెగ్యులేటరీ ఆమోదం, కమర్షియల్ లాంచ్‌కు ఏ కరోనా వ్యాక్సిన్లు కూడా మంచివి కావు.

ఈ వ్యాక్సిన్లతో పెద్ద సంఖ్యలో పాల్గొనేవారికి దీర్ఘకాల సమర్థతను అందించే బలమైన డేటా లేవనే చెప్పాలి.

ఈ ట్రయల్స్ కేవలం నాలుగు నెలలు లేదా అంతకంటే తక్కువ సమర్థత కలిగి ఉన్నాయి’ అని బాల్ పేర్కొన్నారు.యూకే, అమెరికా, బ్రెజిల్, జపాన్, సౌతాఫ్రికా దేశాల్లో AstraZeneca నిర్వహిస్తున్న హ్యుమన్ ట్రయల్స్‌లో మొత్తంగా 50వేల మంది పాల్గొంటున్నారు. ఇక ఇండియాలో సీరమ్ ఇన్సిస్ట్యూట్ నిర్వహించే ట్రయల్స్ లో 1,600 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారు.

ఈ రెండు కంపెనీల ట్రయల్స్ ఫలితాలు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని అంటున్నారు. యూకేలో సెప్టెంబర్ ఆరంభంలో మూడో దశ ట్రయల్ సమయంలో దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపించాయి. దాంతో అమెరికాలో AstraZeneca’s క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోయాయి.నియంత్రిత సంస్థలు ట్రయల్స్ డేటాను సమీక్షించిన తర్వాత యూకే, ఇండియా సహా ఇతర దేశాల్లో మాత్రం ట్రయల్స్ తిరిగి ప్రారంభమయ్యాయి.

Zydus Cadila, Bharat Biotech రెండు కంపెనీలు మాత్రమే తమ రెండో దశ ట్రయల్స్ పూర్తి చేశాయి. చివరి దశ ప్రారంభించేందుకు భారత్ బయోటెక్ DCGI ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.