కరోనా కట్టడిలో కార్పోరేషన్ ఏఈ ప్రేమ పాఠాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంద సంస్ధలు కూడా కృషి చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించటం చేస్తున్నాయి. కొన్ని సంస్ధలు వారికి అవసరమైన నిత్యావసరాలను అందించాయి. కరోనా కట్టడి విధుల్లో ఉన్న చెన్నై కార్పోరేషన్ కు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ ఒకరు వలంటీరుగా సేవ చేయటానికి వచ్చిన ఓ కళాశాల విద్యార్ధినిని ప్రేమ పాఠాలతో ట్రాప్ చేయ బోయాడు. తనకు అప్పగించిన విధులు పక్కన పెట్టి ప్రేమ పాఠాలు వల్లించాడు. అడ్డంగా బుక్కై సస్పెండయ్యాడు.

చైన్నై కార్పోరేషన్ పరిధిలో మైక్రో టీం సభ్యులు కరోనా కట్టడికి విశేషమైన కృషి చేస్తున్నారు. ఆ సంస్ధ సభ్యులు ఇంటింటికి తిరిగి జ్వరాన బారినపడ్డ వారి వివరాలు సేకరిస్తున్నారు. వారిని హోం క్వారంటైన్ లో ఉంచటం, వారికి కావల్సిన నిత్యావసర వస్తువులు, మందులు అందించటం వంటి సేవలను అమోఘంగా అందిస్తున్నారు.

చెన్నైలోని రాయపురం మండలం పరిధిలోని ప్రాంతాల్ని అసిస్టెంట్ ఇంజనీర్ కమల్ కన్నన్ పర్యవేక్షిస్తున్నారు. ఆయన పరిధిలోని మన్నడిలో వలంటీర్‌గా కరోనా సేవలో ఉన్న ఓ కాలేజికి చెందిన విద్యార్థినిపై ఆయన మనస్సు పారేసుకున్నాడు.

తరచు ఆ విద్యార్ధినితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయసాగాడు. ఆమెకు దగ్గరయ్యేందుకు తన పరిధిలోని చిన్న చిన్న పనులు ఆమెకు చెప్పి చేయించటం మొదలెట్టాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్ నెంబరు తీసుకుని ఆమెకు కరోనా విధులతో పాటు….ప్రేమ పాఠాలు వల్లించసాగాడు.

టికి టాక్ లో నిన్ను చూడగానే….అంటూ ప్రేమ పాటలతో వీడియోలు చేసి పంపించాడు. రోజుకో రకంగా ఆమెకు తన ప్రేమను వ్యక్త పరుస్తూ వాయిస్ మెసేజ్ లు, ఇమేజ్ లు, వీడియోలు పంపిస్తూ వేధించసాగాడు.

రెండేళ్లక్రితం నువ్వు కనపడి ఉంటే శ్రీమతి కమల్ కన్నన్ అయ్యేదానివని…. ఆ అదృష్టాన్ని మిస్ చేసుకున్నావని..అయినా దేవుడు మరో చాన్స్ ఇచ్చాడంటూ ఆమెకు ప్రేమ సందేశం పంపాడు. తాను ఏఈ గా పని చేస్తూ తనది అసిస్టెంట్ పోలీసు కమీషనర్ ర్యాంకు అని జీతం నెలకు 78 వేల రూపాయలని దీన్ని బట్టి చూస్తే నువ్వెంత సుఖ పడొచ్చో ఆలోచించుకో అంటూ ఆశలు రేకెత్తించేలా ఆడియో మెసేజ్ లు పంపించాడు.

కన్నన్ పంపించిన ఏ మెసేజ్ కు రిప్లయి ఇవ్వకుండా అతని వేధింపులను మౌనంగా భరించిన విద్యార్దిని అతడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. కన్నన్ తనతో ఫోన్లో మాట్లాడిన మాటలు వాయిస్ రికార్డు చేసి ఎస్ ప్లనేడ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ చేసింది.

READ  సినిమా ఇన్పిరేషన్ : 14 రేప్ లు..మర్డర్లు 

దీంతో కన్నన్ కృష్ణలీలలు కార్పోరేషన్ కమీషనర్ దృష్టికి వెళ్లాయి. రేయింబవళ్లు అనేక మంది అధికారులు కరోనా కట్టడిలో శ్రమిస్తుంటే, విధుల్ని పక్కన పెట్టి, సేవకు వచ్చిన యువతిని ముగ్గులో దించేందుకు సాగిస్తున్న ప్రేమ లీలల కారణంగా అతడ్ని ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

 

Related Posts