లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

ముగిసిన గ్రేటర్ పోలింగ్.. దాదాపు 40శాతం వరకూ నమోదైనట్లు అంచనా

Published

on

GHMC Elections: దాదాపు 40శాతం వరకూ పోలింగ్ నమోదైనట్లు అంచనా. పోలింగ్ శాతాన్ని మరి కాసేపట్లో ఎన్నికల సంఘం ప్రకటించనుంది. క్యూలైన్లలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఇచ్చారు. కొన్ని డివిజన్లలో 30శాతం కంటే తక్కువే నమోదైనట్లు సమాచారం. డిసెంబర్ 1 మంగళవారం జరిగిన ఎన్నికలను 6గంటలకే క్లోజ్ చేసింది.

గ్రేటర్ ఎన్నికల్లో కొద్ది చోట్ల చెదురుమదురు గొడవలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటేసేందుకు గతంలో కంటే మరింత దారుణంగా నమోదైంది ఓటింగ్ శాతం. ఓల్డ్ మలక్‌పేట్‌లో ఎల్లుండి (గురువారం) రీపోలింగ్ జరగనుంది. ఉప్పల్, రామ్ నగర్ ప్రాంతాల్లో కొద్దిపాటి ఘర్షణలు జరిగాయి.బ్యాలెట్ బాక్సులను క్లోజ్ చేసిన అధికారులు సేఫెస్ట్ ప్లేస్ లకు తరలించనున్నారు. సెలబ్రిటీల నుంచి ఎన్నికల సంఘం వరకూ భారీ ఎత్తున ప్రచారం నిర్వహించి ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అమీర్ పేట్‌లో 5శాతం కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది.

కొవిడ్ భయం, సెలవులు వంటివి రావడంతో ఓటర్లు హైదరాబాద్ కు దూరంగా ఉన్నట్లు కనిపించింది. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను బట్టి 60శాతం వరకూ ఓటింగ్ జరుగుతుందని భావించినా ఫలితాలు తారుమారయ్యాయి.

చిక్కడపల్లి: ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ ప్రశాంతంగా జరిగాయి. క్యూ లైన్లలో ఎవరూ లేకపోవడంతో సమయానికే అధికారులు బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి స్ట్రాంగ్ రూంలకు పంపుతారు. 37శాతం వరకూ నమోదైందని. ఊహించిన దాని కంటే ఎక్కువగానే వచ్చారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *