Home » ప్లాస్టిక్ రహిత : తిరుమల శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్ మంత్ర బ్యాగులు
Published
5 days agoon
Green mantra bags for Srivari brownies : తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం గ్రీన్ మంత్ర బ్యాగులను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్‌ను ఇప్పటికే నిషేధించిన టీటీడీ.. పేపర్, జనపనారలతో తయారు చేసిన బ్యాగులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. ఆ ప్రత్యామ్నాయ బ్యాగుల ధరలు అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టీడీడీ అధికారులు ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ప్లాస్టీక్ రహిత బ్యాగులను గ్రీన్ మంత్ర బయోడిగ్రేడబుల్‌గా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐదు లడ్డూలు పట్టే బ్యాగును మూడు రూపాయలకు, పది లడ్డులు పట్టే బ్యాగులను ఆరు రూపాయలకు అందిస్తుంది. ఈ బ్యాగులను పర్యావరణ పరిరక్షణతో పాటు మొక్కల పెంపకానికి ఎంతో ఉపయోగపడే విధంగా తయారీదారులు రూపొందించారు. దాదాపు 10లక్షల బ్యాగులను అందుబాటులోకి తెచ్చారు.
హిందువులకు మాత్రమే అమ్మాలి, టీటీడీ ఆస్తులపై హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక, 2 కోట్ల విలువైన శంఖు చక్రాలు విరాళం
బ్రహ్మోత్సవం : రథసప్తమి, తిరుమల ముస్తాబు
శ్రీవారి ఆలయంలో మార్చిలో ఆర్జిత సేవల పునరుద్ధరణ
జనవరిలో శ్రీవారి ప్రత్యేక దర్శనం కోటా టికెట్లు విడుదల
టీటీడీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు ఏర్పాటు