గ్రూపు-1 మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల : APPSC

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. నవంబర్ 2 నుంచి 13 వరకు జరగాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది.మెయిన్స్ పరీక్షలను డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించనున్నట్టు తెలిపింది.

నవంబర్ 21 నుంచి 29వరకు ప్రభుత్వ ఉద్యోగులకు డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించనుంది.

మెయిన్స్ పరీక్షల రీషెడ్యూల్డ్ తేదీలను సంస్థ వెబ్ సైట్ psc.ap.gov.inలో అందుబాటులో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటనలో వెల్లడించింది.మరోవైపు.. గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించినట్టు తెలిపింది.

గ్రూపు-1 మెయిన్స్ పరీకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ psc.ap.gov.inలో అందుబాటులో ఉంచింది.

Related Tags :

Related Posts :