GST collections remain subdued at Rs 95,380 crore in October

పండుగ సీజన్‌లో సీన్ రివర్స్ : భారీగా తగ్గిన GST వసూళ్లు  

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అక్టోబర్.. అసలే పండుగ సీజన్. మార్కెట్ అంతా సేల్స్ తో కళకళాలాడే నెల. వినియోగదారులను ఆకర్షించేందుకు సేల్స్ కంపెనీలు తమ ప్రొడక్టులపై ఆఫర్లు గుప్పించే సమయం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వస్తువులను కొనేందుకు వినియోగదారులు సైతం తెగ ఆరాటపడుతుంటారు. 

వస్తువుల కొనుగోలుపై జీఎస్టీ విధించడానికి అనువైన సీజన్ కూడా. కానీ, జీఎస్టీ వసూళ్లు ఊహించిన దానికంటే దారుణంగా క్షీణించాయి. ఎందుకిలా జరిగింది.. దేశంలో ఆర్థిక మందగమనమే కారణమా? లేదా సేల్స్ నెమ్మదించడమా? కారణం ఏదైనా జీఎస్టీ వసూళ్లు ఎన్నడూలేనంతగా దిగువ స్థాయికి పడిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఒకవైపు మార్కెట్లో అంతగా ఆఫర్లు ప్రకటించినా వస్తువుల కొనుగోళ్లు భారీగా జరిగినప్పటికీ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పడిపోయాయి. పండగ సీజన్ కదా.. జీఎస్టీ వసూళ్లు కూడా అధికంగా రాబడతాయని భావించినప్పటికీ సీన్ రివర్స్ అయింది. దేశంలో ఆర్థిక మందగమనం ప్రభావంతో అక్టోబర్ నెలలో ఆశించిన స్థాయి కంటే దారుణంగా జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. మరోసారి రూ.లక్ష కోట్ల మార్క్ దిగువునే జీఎస్టీ వసూళ్లు ఉండిపోయాయి. 

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.91వేల 916కోట్లుగా నమోదు కాగా.. అక్టోబర్ నెలలో జీఎస్‌టీ కలెక్షన్స్ 5.30 శాతం తగ్గుదలతో రూ.95,380 కోట్లకు క్షీణించాయి. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. కేంద్ర జీఎస్టీ 17,582 కోట్ల రూపాయలుగా ఉండగా, సెప్టెంబర్‌లో రూ .16,630 కోట్లుగా నమోదైంది.

సెప్టెంబరులో రాష్ట్ర జీఎస్టీ వసూలు రూ .23,674 కోట్లు, రూ .22,598 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ సెప్టెంబర్‌లో రూ .46,517 కోట్లు, రూ .45,069 కోట్లుగా నమోదైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్ దిగువకు పడిపోవడం ఇది వరుసగా మూడోసారి. పండగ సీజన్ ఎక్కువగా డిమాండ్ ఉండటంతో.. రానున్న వారాల్లో జీఎస్టీ వసూళ్లతో రెవిన్యూ స్థాయి భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. 

కానీ, సెప్టెంబర్ నెలలో కొనుగోలు డిమాండ్ తగ్గిపోవడంతో సేల్స్ మందగించాయి. తద్వారా జీఎస్టీ కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయి కంటే దిగువ స్థాయికి పడిపోవడం గమనార్హం. అక్టోబర్ నెలలో సెప్టెంబర్ పన్ను రాబడులకు సంబంధించి 7.38 మిలియన్లు రిటర్న్స్ దాఖలు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గతనెలతో పోలిస్తే 7.59 మిలియన్ల కంటే కొంచెం తక్కువగా ఉందని పేర్కొంది.

పన్ను రసీదులు సెటిల్ చేసిన తర్వాత అంతర్రాష్ట్ర సరఫరాల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలలో అక్టోబర్ లో వచ్చిన మొత్తం ఆదాయం వరుసగా రూ. 38,224 కోట్లు, రూ.37,645 కోట్లుగా నమోదైంది. ఏప్రిల్-జూలైలో జీఎస్టీ వసూలు రూ .1 ట్రిలియన్ మార్కు కంటే ఎక్కువగా ఉంది. ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబరులలో క్షీణించింది. 

READ  వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ : 6శాతానికి పడిపోనున్న భారత వృద్ధి రేటు

Related Posts