లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఉల్టా : తిరగేసిన కళ్లజోడు..రేటు చూస్తే బేజారు

Published

on

Gucci introduces upside down sunglasses worth rs. 56,000 : స్టైల్ కోసమో, సైట్ ఉంటేనో, లేదా సేఫ్టీ కోసమో కళ్ల జోడు పెట్టుకుంటాం. ఏ కళ్లజోడైనా ఎలా ఉంటుంది. అద్దాలు కిందకు ఫ్రేము పైకి ఉంటుంది. చెవులకు కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా ఫ్రేము ఉంటుంది.కానీ ఈ కళ్లజోడు వెరీ వెరీ వెరైటీ. తిరగేసి ఉంటుంది. అంటే అద్దాలు పైకి ఫ్రేము కింది ఉంటుంది. పెట్టుకోవటానికి వీలుగానే ఉంటుంది. ఈ వెరైటీ కళ్లజోడు ధర కూడా వెరైటీనే..అంటే కాస్ట్లీ..

సాధారణంగా ఒక కళ్లజోడు ధర ఎంతుంటుంది? అద్దాలు, ఫ్రేమ్‌ క్వాలిటీని బట్టి రూ.10 వేలు, లేదా రూ.15వేలు ఉండొచ్చు. కానీ ఈ తిరగేసిన కళ్లజోడు ధర మాత్రం రూ.56 వేలు…!!. దీని ధరను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కళ్లజోడును తిరగేస్తే ధర పెరిగిపోతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.

Gucci’ సంస్థ.. ఇటీవల ఈ తిరగేసిన కళ్లజోడును మార్కెట్ లోకి తెచ్చింది. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్‌ సన్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తూ దాని ధర చెప్పేసరికి కస్టమర్లకు కళ్లు తిరుగుతున్నాయి. ‘ఇన్వెర్టెడ్ క్యాట్ సన్ గ్లాసెస్’గా పిలిచే ఈ తిరగేసిన కళ్లజోడు ధర రూ.56 వేలుగా ప్రకటించింది. బ్లాక్ అండ్ వైట్ రంగులతో ఆకర్షణీయంగా ఉన్న ఈ కళ్లజోడు చూసేందుకు వెరైటీతో పాటు వెరీ క్యూట్ గా ఉంది.

దాన్ని పెట్టుకుంటే సరదా కోసమో..లేదా వెరైటీ కోసమో తిరగేసి పెట్టుకున్నట్లుగా ఉంటుంది.చూడగానే కళ్లజోడు తిరగేసి పెట్టుకున్నారా? అనిపిస్తుంది. పైగా రేటు కూడా కాస్త ఎక్కువేనంటున్నారు జనాలు. కానీ దీని రేటు విషయంలో సంస్థ మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు.

ఫిక్స్ చేసిన రేటుకే అమ్మకానికి పెట్టింది. ఆన్‌లైన్‌లో కూడా దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డెలీవరీ చార్జీలు ఫ్రీ అని ప్రకటించింది. ఈ తిరగేసిన కళ్లజోడుపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తిరగేసీ మరీ అమ్మేస్తూ డబ్బులు మాత్రం బాగానే లాగేద్దామనే అబ్బా ఎంత ఉల్టా తెలివితేటలుగా బాబూ అంటున్నారు.