gucci-top-fashion-brand-is-selling-jeans-with-fake-grass-stains-for-rs-88000

పాచి పట్టిన ఈ ప్యాంటు ధర రూ.90వేలు..!! 2020 వింటర్‌ కలెక్షన్ ట్రెండ్.. ‌‌

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓ ప్యాంటు ధర ఎంత ఉంటుంది. రూ.2 వేలు లేదా 5 వేలు. అదే బ్రాండెడ్ ప్యాంట్ అయితే రూ.7 నుంచి 10 వేలు ఉంటుంది. కానీ ప్యాంటు ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదనేలా ఉంది. ఎంతంటే రూ.90 వేలు..!! ఏంటీ..నోరెళ్లబెట్టారా?..అదీ దాని రేంజ్..ఇంతకీ ఆ ప్యాంటు ఏదో గ్రాండ్ లుక్ లో మాత్రం లేదు..ఏదో సాదా సీదాగానే ఉండటం మరో విశేషం. మరి ఆ రిచ్ ప్యాంటు ధర కథాకమామీషు ఏంటో చూద్దాం..అదేనండీ తెలుసుకుందాం..


ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గుచ్చి.. 2020 వింటర్‌ కలెక్షన్‌‌లో భాగంగా కొత్త ప్యాంట్‌లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ.88వేలు. అంటే దాదాపు రూ. 90వేలుగా పెట్టింది. అంతలా ఈ ప్యాంట్‌లో ఏముందని అనుకుంటున్నారా? ఈ ప్యాంట్‌లు పచ్చగడ్డి మరక అంటినట్టుగా ఉంటాయి. లైట్ బ్లూ కలర్ జీన్స్‌ ప్యాంట్‌పై పచ్చగడ్డి మరక అంటినట్లు దీన్ని డిజైన్‌ చేశారు.


ఈ వైడ్-లెగ్ డెనిమ్ ప్యాంట్‌ను సేంద్రీయ పత్తితో తయారుచేసినట్లు గుచ్చి తెలిపింది. ఈ ప్యాంట్‌ ధరిస్తే చలికాలం గడ్డిలో కూచున్న మరకలు అంటాయనే అనుభూతి‌ కలుగుతుందని గుచ్చి తెలిపింది. గుచ్చి ప్రపంచ వ్యాప్తంగా లెదర్ జాకెట్లు, బెల్టులు, బ్యాగులు, బూట్లు, జీన్స్‌ తయారీకి ప్రసిద్ధి. దీని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది.


సామాన్యులతో పాటు సినీ, క్రీడా సెలెబ్రిటీలు ఈ సంస్థ ఉత్పతులను వినియోగిస్తారు. భారత్‌లో కూడా ఈ సంస్థకు ఎన్నో షాపులున్నాయి.ఈ బ్రాండ్ కు మంచి డిమాండూ ఉంది. మరి ఈ పచ్చగడ్డి మరకల ప్యాంట్లు కష్టమర్లను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి.

Related Posts