లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్ ఆత్మహత్య

Published

on

Gudiwada Two Town SI Vijaya Commits Suicide : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడలో టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హనుమాన్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్నవిజయ్.. తన అపార్ట్ మెంటులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానిస్తున్నారు. మూడు నెలల క్రితమే వివాహమైంది. అయినా భార్యను కాపురానికి తీసుకురావడం లేదు.

పెళ్లి అయినప్పటి నుంచి మరో మహిళతో కలిసి ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఏలూరుకు చెందిన విజయ్ కుమార్ 2012లో బ్యాచ్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టాడు. పెళ్లి చేసుకున్నా భార్యను కాపురానికి తీసుకురాకుండా నూజువీడుకు చెందిన బ్యూటీషియన్ తో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో ఎస్ఐ విజయ్ సస్పెండ్ అయ్యాడు.

అప్పటినుంచి బ్యూటీషియన్ తో కలిసి ఒక అపార్ట్ మెంటులో ఉంటున్నాడు. పెళ్లి చేసుకోవాలంటూ బ్యూటిషయన్ ఒత్తిడి చేయడం వల్లే విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహ్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.