లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేసి అమెరికా వెళ్లిపోయిన భర్త…..అత్త,మామల వేధింపులు

Published

on

అహమ్మదాబాద్ లోని నవవదాజ్ ప్రాంతంలో నివసిస్తున్న 32 ఏళ్ల వివాహిత అత్తమామలు వేధిస్తున్నారని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త తనను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడని అప్పటి నుంచి అత్త మామలు వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కోంది.

అహమ్మదాబాద్ లో నివసించే అనిత కు (32) (పేరు మార్చబడింది)2013 లో సుధాకర్ తో వివాహం అయ్యింది. అనిత ఒక ప్రయివేట్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తోంది. సుధాకర్ ప్రస్తుతం  యూఎస్ లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి 2014లో ఒక పాప పుట్టింది. అప్పటి నుంచి సుధాకర్ భార్య పట్ల కోపంగా ఉన్నాడు.ఆమె అత్తమామలు కూడా ఆడపిల్ల పుట్టటంతో సంతోషంగా లేరని……ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక రకంగా గొడవలు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కోంది. కాగా 2016 లో సుధాకర్ యూఎస్  లో ఉద్యోగం రావటంతో భార్య, పిల్లలను తల్లి తండ్రుల వద్ద వదిలేసి ఒక్కడే యూఎస్ వెళ్ళిపోయాడు.

తాను భర్తతో ఉండి కాపురం చేయటానికి ఇష్టపడినప్పటికీను భర్త తనకు తెలియకుండా  విదేశాల్లో ఉద్యోగం చూసుకుని వెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.2018లో భర్త ఒకసారి ఇండియా వచ్చినప్పుడు….. తాను మళ్లీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు భార్యకు చెప్పి….తన నుంచి విడాకులు కోరాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె అందుకు  తిరస్కరించటంతో తనను అత్తమామల వద్ద వదిలేసి మళ్లీ యూఎస్ వెళ్లి పోయాడని…. ఇక్కడ అత్తమామలు వేధిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో వివరించింది. కనుక… తనకు న్యాయం చేయాలని అనిత పోలీసులను వేడుకుంది.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *