లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఆరో పెళ్లాం కోరిక తీర్చలేదని ఏడో పెళ్లికి సిధ్దమైన ముసలోడు

Published

on

63-year-old farmer lusts for a 7th wife, 6th wife refused sex : డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అనే సమాజంలో మనం బతుకుతున్నాం. వంటినిండా రోగాలతో, అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ కూడా ఆరో పెళ్ళాం కోరికలు తీర్చలేదని ఏడోపెళ్లికి సిధ్దమయ్యాడు ఒక ధనిక రైతు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ ధనిక రైతు(63) తనకంటే వయస్సులో ఇరవై ఏళ్లు చిన్నదైన ఆరో భార్య అతనితో శారీరక సంబంధానికి నిరాకరిస్తోందనే కారణంతో ఏడో వివాహం చేసుకోటానికి సిధ్దమయ్యాడు.

గతేడాది సెప్టెంబర్ లొ ఒక వితంతువును ఆరో వివాహం చేసుకున్నాడు. అప్పుడు కరోనా వైరస్ కారణంగా ఆమె అతడిని దూరం పెట్టింది. ఈ కారణం చూపి పెళ్లైన నాలుగు నెలలకే డిసెంబర్ లో ఆమెతో తెగతెంపులు చేసుకున్నాడు. తనకు గుండె సంబంధింత సమస్యలు, డయాబెటిస్, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నాయనే నెపంతో, తన బాగోగులు చూసుకునేందుకు ఓ తోడు కావాలని…అందుకే మరో పెళ్లి చేసుకుంటున్నాని వాదిస్తున్నాడు.

భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న ఆరో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. ఈ నిత్య పెళ్లి కొడుకు ఎవరితోనూ ఎక్కువ కాలం సంసారం చేయడని, డబ్బు ఎరగా చూపి పెళ్లి చేసుకొని, వాడుకొని ఏదో ఒక కారణం చూపించి వదిలేస్తాడని పోలీసుల విచారణలో తేలింది.

నిందితుడు తన గత వివాహాల గురించి తన వద్ద దాచి పెట్టి వివాహం చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తనకు ఇస్తానన్న నగదు, ఇళ్లు కూడా ఇవ్వలేదని బాధిత మహిళ ఆరో భార్య ఆరోపించింది. కాగా, అతని మొదటి భార్య.. 20 నుంచి 35 ఏళ్ల మధ్యవయస్కులైన తన పిల్లలతో కలిసి అదే గ్రామంలో ఉంటుందన్న విషయం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు.

నిందితుడిపై 498-A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ అచార వ్యవహారాల్లో ఇలా వివాహాలు చేసుకోవడం రివాజేనని నిందితుడు వాదించడం కొసమెరుపు.