15 కిలోల చాక్లెట్‌తో రామ‌మందిరం తయారు చేసిన మహిళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో రామాలయ భూమిపూజ జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా భూమిపూజ అంగరంగ వైభోగంగా కన్నుల పండుగా జరిగింది.ఈ శుభ సమయం కోసం ఎంతో మంది వేయి కళ్లతో ఎదురు చూసిన శుభసమయంలో గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌కు చెందిన శిల్పాభ‌ట్‌ అనే రామ‌భ‌క్తురాలు 15 కిలోల చాక్లెట్ తో రామమందిరాన్ని రూపొందించారు.బేకరి నడిపే శిల్పాభట్ చాక్లెట్ తయారీదారు చేయటంతో మంచి పేరు సంపాదించారు. రామమందిర నిర్మాణ భూమి పూజ సందర్భాగా శిల్పాభట్ 15 కిలోల చాక్లెట్ ఉపయోగించి రామాల‌య న‌మూనాను రూపొందించారు. ఈ ఆలయాన్ని రూపొందించేందుకు శిల్ప‌కు 12 గంటలు పట్టింది. ల‌యంలో చాక్లెట్ స్తంభాలు, గర్భగుడిని ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా మ‌లిచారు. చూడముచ్చటా ఉండే ఈ చాక్లెట్ రామమందిరం అచ్చు గుద్దినట్లుగా రామమందిరంలాగేనే ఉంది.

ఈ సందర్భంగా శిల్పాభట్ మాట్లాడుతూ..ఈ చాక్లెట్ రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కానుక‌గా ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు. ఆమె ప్రధాని సంకల్పశక్తి వల్లనే ఈరోజున రామమందిర నిర్మాణం కల సాకారం అయ్యిందని..మోడీ కృషితోనే రామాలయ నిర్మాణానికి పునాది రాయి ప‌డిందని అన్నారు.తాను ఈ చాక్లెట్ రామాల‌యాన్ని ప్ర‌ధానికి అంద‌జేయాల‌నుకుంటున్నాన‌ని, అది కుద‌ర‌కపోతే..ఈ చాక్లెట్ రామమందిరాన్ని చిన్నారులకు రామ ప్ర‌సాదంగా పంచుతానని తెలిపారు. శిల్ప గత నాలుగేళ్లుగా చాక్లెట్‌తో సందర్భానికి తగినట్లుగా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆకృతుల‌ను చేస్తున్నారు. శిల్పా తయారు చేసే చాక్లెట్లకు స్థానికంగా మంచి డిమాండ్ఉంది.

Related Posts