మేనకోడలితో అక్రమ సంబంధం…చివరికి ఏకాంతంగా ఉన్న వీడియోలు పంపి బ్లాక్ మెయిల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మాయమాటలు చెప్పి మేనకోడలును లొంగదీసుకున్నాడు. కొంతకాలం ఆమెతో ఏకాంతంగా గడిపాడు. పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి మేనకోడలు నిరాకరించడంతో ఏకాంతంగా గడిపిన వీడియోలు కుటుంబ సభ్యులకు పంపి బ్లాక్‌ మెయిల్‌కు దిగాడు ఓ కీచక మేనమామ. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ లో చోటు చేసుకుంది.

సౌరాష్ట్రకు చెందిన ఓ యువతి సూరత్‌లోని పూనా ప్రాంతంలో చీరలపై లేస్ వర్క్ చేస్తూ జీవినం గడుపుతోంది. ఈ పనిని ఆమె మేనమామ(30) నేర్పించాడు. ప్రతి రోజు యువతి ఇంటికి ఆయన వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అతని నమ్మి అతనితో రహస్యంగా గడిపింది.


ఈ సమయంలో యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మేనమామ.. యువతి దగ్గరికి వచ్చి పెళ్లి తర్వాత కూడా తనతో లైంగిక సంబంధాన్ని కొనసాగించాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించడంతో పాటు అతన్ని దూరంగా పెట్టింది. దీంతో ఆగ్రహం పెంచుకున్న అతడు.. వారిద్దరు ఏకాంతంగా గడిపిన వీడియోను యువతి తండ్రితో పాటు, వారి బంధువులకు పంపాడు. అనంతరం యువతిని మానసికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో యువతి తండ్రి సూరత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Posts