అన్న పెళ్లి చూశాడు. నాన్న.. నా పెళ్లి అన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న కొడుకు కాదనలేక తండ్రి గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. బ్యాండ్, బాజాలు, బరాత్ అన్ని సిద్ధం చేశారు.
అన్న పెళ్లి చూశాడు. నాన్న.. నా పెళ్లి అన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్న కొడుకు కోరిక కాదనలేక తండ్రి గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేశాడు. బ్యాండ్, బాజాలు, బరాత్ అన్ని సిద్ధం చేశారు. అతిథులు కూడా వచ్చేసారు. వెరైటీ ఫుడ్ ఐటమ్స్ తో విందు భోజనం ఏర్పాటు చేశారు. పెళ్లికొడుకు కూడా అందంగా ముస్తాబయ్యాడు. నుదిటికి తిలకం దిద్దారు. పెళ్లికొడుకుని ఎత్తుకుని ఊరేగిస్తూ.. పెళ్లిపీటల మీదకు తీసుకొచ్చారు. ఇక పెళ్లి తంతే మిగిలింది. కానీ, ఈ పెళ్లిలో పెళ్లికూతురే లేదు. పెళ్లికుమార్తె లేకుండానే పెళ్లి తంతు జరిపించారు. అదేంటీ.. ఇదేమైనా సాంప్రదాయం ఏమో? అనుకుంటే పొరపాటే.
అసలు కారణం.. పెళ్లికొడుకే. ఎందుకో తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు. కన్నీళ్లు ఆగవు.. అతడి పేరు.. అజయ్ బరోట్ (27). గుజరాత్ రాష్ట్రంలోని హిమయాత్ నగర్ వాసి. తనకు పెళ్లి చేసుకోవాలని కోరిక. ఇటీవల అన్న పెళ్లి జరిగింది. ఆ పెళ్లి తంతు చూసిన అజయ్.. తనకు పెళ్లి చేయాలని తండ్రిని కోరాడు. కానీ, అతడికి పెళ్లి సంబంధం చూసినా ఎవరూ అమ్మాయిని ఇవ్వరు. ఎందుకంటే.. అజయ్ మానసిక రోగి. అతడు ఏది నేర్చుకోలేడు.
పుట్టినప్పుడే అజయ్ తల్లి చనిపోయింది. అప్పటినుంచి తల్లి లేకుండానే పెరిగాడు. మానసికంగా అతడికి మెచ్యూరిటీ లేదు. చిన్నపిల్లవాడితో సమానం. 27ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ.. ఇప్పటికి అతడు చిన్నపిల్లాడి మనస్తత్వమే. తండ్రికి పెళ్లి వద్దు నాయనా అని ఎంతగా నచ్చజెప్పినా వినలేదు.. నాకు పెళ్లి చేయాల్సిందేనని పట్టుబడ్డాడు.

అమాయక చక్రవర్తి కొడుకు కోరిక కాదనలేక.. తండ్రి విష్ణు బరోత్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు. అది పెళ్లి కూతురు లేకుండానే. అది తెలిసిన ఊరి జనం వ్యతిరేకించారు. పెళ్లి కూతురు లేకుండా పెళ్లేంటీ అన్నారు. అయినప్పటికీ కొడుకు కోసం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు తండ్రి. కుమారుడి కోరికను ఎలాగైన తీర్చాలని అంగరంగ వైభవంగా పెళ్లివేడుక జరిపించాడు. పెళ్లి వేడుకలో దాదాపు 800 మంది కోసం విందు ఏర్పాటు చేయించాడు.
పెళ్లి వేడుకల్లో మ్యూజిక్, డ్యాన్స్ చేస్తుంటే.. అది చూసి పెళ్లికొడుకు అజయ్ ఎంతో సంతోషించాడు. ఫిబ్రవరిలో తన సోదరుడి పెళ్లి చూసినప్పటి నుంచి గ్రామంలో ఎక్కడ పెళ్లి జరిగినా అక్కడికి పరిగెత్తుకెళ్లేవాడని అజయ్ అంకుల్ తెలిపారు. తన పెళ్లి కూడా ఇలానే చేయాలని పట్టుబట్టడంతో పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చినట్టు చెప్పారు. అచ్చం పెళ్లి వేడుకలానే జరిపి అజయ్ కోరిక తీర్చినట్టు తెలిపారు.