లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

భార్య కోరికలు తీర్చటానికి బైకుల దొంగగా మారిన భర్త

Published

on

Gujarat man  bikes thefts his wifes demands : ‘‘ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు..పక్కింటి పిన్నిగారి కాసుల పేరు చూడు..’’ శుభలగ్నం సినిమాలో ఆమని భర్త జగపతిబాబుని వేధిస్తు పాడిన పాట గుర్తుంది కదూ..ఇదిగో ఈ భార్య కూడా అటువంటిదే.భార్య గొంతెమ్మ కోరికిలు తీర్చటానికి దొంగగా మారాడు ఓ భర్త. బైకులు దొంగతనాలు చేస్తూ జైలు పాలయ్యాడు. గత కొంతకాలంగా బైకులు దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్న ఈ భర్తగారి బండారం బైటపడింది. గత ఆదివారం పోలీసులు సదరు బైకుల దొంగను పట్టుకోవటంతో పోలీసులు కూడా షాక్ అయ్యే విషయాలను బైటపెట్టాడు ఆ బైకుల దొంగ.గుజరాత్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భావ్‌నగర్‌ జిల్లా జలియ గ్రామానికి చెందిన బల్వంత్‌ చౌహాన్‌ వజ్రాలకు మెరుగులుదిద్దే పని చేసేవాడు. మిడిల్ క్లాస్ జీవితంతో ఉన్నంతలో బాగానే బతుకుతున్నాడనిపిస్తున్నాడు. కానీ గొర్రెకు బెత్తెడు తోకలాంటి ఈ జీవితం ఎన్నాళ్లు..సంపాదించటం చాతకాదుగానీ అంటూ భార్య సూటి పోటీ మాటలు భరించలేకపోయేవాడ బల్వంత్ చౌహాన్..ప్రతీ విషయాన్ని ఎదుటివారితో పోలుస్తూ..దెప్పి పొడుస్తూ భర్తను ఈసడించేది.బాగా సంపాదించుకుంటున్న తన అక్క జీవితంతో పోల్చుకుంటు భర్తను సాదించేంది. బిల్డర్‌ అయిన అక్క భర్తతో తన భర్తను పోల్చి..కూలోడిలా ఎన్నాళ్లు ఈ బతుకు అంటు తిట్టిపోయేది. ప్రతి రోజు మూతి విరుపులు, దెప్పిపొడుపులు బల్వంత చౌహాన్ కు మామూలైపోయాయి. ఉదయం లేచినప్పటినుంచి అవే దెప్పిపొడుపు మాటలతో విసిగిపోయేవాడు. భార్యమీద విసుక్కుంటే చాలు..సంపాదన లేదుగానీ ఈ పెత్తనాలకేం తక్కువలేదంటూ తీసిపారేసేది..దీంతో ఆమె పోరు భరించలేక..భార్య గొంతెమ్మ కోరికలు తీర్చటానికి బల్వంత్ బైకుల దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈక్రమంలో కరోనా కల్లోలంతో లాక్ డౌన్ వచ్చి పండింది. దీంతో బల్వంత్ ఉన్న చిన్న ఉద్యోగం కాస్తా పోయింది. ఇక పూర్తిస్థాయి బైకుల దొంగగా మారిపోయాడు.ఎక్కడన్నా బైకు కనిపిస్తే చాలా దాన్ని కొట్టేసేదాకా నిద్రపోయేవాడు కాదు.అలా 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేసిన బల్వంత్ చౌహాన్ 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 29 బైకుల్ని దొంగిలించాడు.అలా తన బైకుల దొంగతనాన్ని ప్రొఫొషన్ గా మార్చేసుకుని వరుస దొంగతనాలు చేస్తున్న క్రమంలో గత ఆదివారం (నవంబర్ 29,2020) బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.


దీంతో అతను దొంగతనం చేసిన బైకుల్ని ఏంచేసేవాడు? ఎవరెవరికి అమ్మాడో మొత్తం కూపీ లాగారు పోలీసులు. వివరాలు చెప్పేసరికి ఆ బైకుల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యకోసం ఇలా బైకుల దొంగగా మారానని చెప్పేసరికి పోలీసులు ఆశ్చర్యపోయారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *