బంగారంతో చేసిన స్వీటు కిలో రూ.9వేలు..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Gujarat : gold sweet : బంగారంతో చిన్న ఉంగరం చేయించుకోవటానికి చుక్కలు కనిపించే ఈ రోజుల్లో ఓ మిఠాయిల వ్యాపారి ఏకంగా బంగారంతో స్వీట్లు తయారు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు. దసరా.. దీపావళి వంటి పండుగలకు స్వీట్లు ప్రత్యేకంగా తయారు చేసే ఈ వ్యాపారం బంగారంతో స్వీట్లు తయారు చేయటం విశేషంగా మారింది.సాధారణంగా స్వీట్లలో వాడే పేపర్ ను సిల్వర్ తో చేసిన పేపర్ వాడతారు.కానీ గుజరాత్ లోని సూరత్ కు చెందిన మిఠాయి షాపు యజమని బంగారంతో తయారు చేసిన స్వీట్లు అమ్ముతున్నారు.
చండీ పద్వో పండుగ సందర్భంగా సూరత్ నగరంలోని శరద్ పూర్ణిమ అనే స్వీటు షాపు యజమాని రోహాన్ బంగారంతో కూడిన ‘గోల్డ్ ఘరీ’ని తయారు చేశారు.పలు రకాల డ్రై ఫ్రూట్లు వేసి తయారు చేసే ‘ఘరి’ కిలో 660 నుంచి 820 రూపాయలకు అమ్ముతుండగా..అందులో 24 క్యారెట్ బంగారం కలిపిన తయారుచేసిన ‘గోల్డ్ ఘరీ’ ప్రత్యేక స్వీట్లను తయారు చేశారు.మన పురాతన కాలంగా వస్తున్న ఆయుర్వేదంలో బంగారం ప్రయోజనకరమైన లోహంగా పరిగణిస్తారని, అందువల్ల చండీ సద్వో పండుగ కోసం తాము ప్రత్యేకంగా ‘గోల్డ్ ఘరీ’ని తయారు చేసి అమ్మకానికి పెట్టామని స్వీటు సాపు యజమాని రోహాన్ తెలిపారు.


ఈ గోల్డ్ ఘరీ కిలో ధర 9వేల రూపాయలుగా నిర్ణయించామని..మార్కెటులో దీనికి డిమాండు తక్కువగానే ఉన్నా తమకంటూ ఓ బ్రాండ్ ఏర్పడిందని..బంగారంతో చేసే స్వీట్లు చాలా అరుదు అని అన్నారు. కానీ రాబోయే రోజుల్లో దీనికి డిమాండు పెరుగుతుందని రోహాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Tags :

Related Posts :