లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

ముస్లిం యువకుడితో బ్రాహ్మణ యువతి పెళ్లి..లవ్ జీహాద్ అంటూ హిందూ సంఘాల రచ్చ

Published

on

Gujarat love jihad act hindu girl muslim boy marriage mumbai :  లవ్ జీహాద్ అనే మాట ప్రస్తుతం పెద్ద వివాదాస్పదంగా తయారయ్యింది. ముస్లిం యువకుణ్ణి వివాహం చేసుకుందనే కారణంతో ఓ హిందూ అమ్మాయి విషయంలో హిందూ సంఘాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మేజర్లు అయిన యువతీ యువకులు వారికి ఇష్టమైన వ్యక్తులతో కలిసి జీవించే హక్కు ఉందని సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సరే లవ్ జీహాద్ పేరుతో పలు వివాహాల విషయం వివాదాలు జరుగుతునే ఉన్నాయి. అటువంటిదే జరిగింది గుజరాత్ లోని వడోదరాలో..

వడోదరలో 23 ఏళ్ల బ్రాహ్మణ యువతి ఓ ముస్లిం ముంబైలోని బాంద్రాలో గల ఒక మసీదులో వివాహం చేసుకుంది. ఈక్రమంలో ఈ వివాహం లవ్ జిహాద్ వ్యవహారం అంటూ వివాదం చెలరేగింది. వడోదరలోని హిందూ సంఘాలన్నీ హంగామా ప్రారంభించాయి. దీంతో గుజరాత్‌ పోలీసులు ఒక బృందాన్ని ముంబై పంపించి ఆ నూతన జంటను వడోదర తీసుకొచ్చేశారు. పోలీసులు ఈ వివాహం చెల్లదంటూ..ఆ యువతిని, యువకుడిని వారివారి ఇళ్లకు పంపించారు.

ప్రస్తుతం తండ్రి ఇంట్లో ఉంటున్న ఆ యువతి వద్దకు వెళ్లిన బీజేపీ నేతలు పలు హిందూ సంఘాల నేతలు ఆమెకు నచ్చచెప్పేందుకు యత్నిస్తున్నారు. కానీ ఆ యువతి మాత్రం అతనే నా భర్త..మీకు మతమే ముఖ్యమనుకుంటే నా భర్తను హిందు మతంలోకి మార్పిస్తానని అంటోంది.

గత ఆరేళ్లుగా అతను నాకు పరిచయం..చాలా మంచివాడు అందుకే వివాహం చేసుకున్నాను..తాము ఒకరినొకరు ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ముంబై వెళ్లి అక్కడి పెళ్లి చేసుకున్నామని తెలిపింది. తాను ఆ యువకుణ్ణి ఒప్పించి, హిందువుగా మారుస్తానని ధీమా వ్యక్తంచేస్తోంది. దీంతో హిందూ సంఘాల సభ్యులు శాంతించినట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ మనుష్యులు వారి అభిప్రాయాలు..హక్కులు కాకుండా మతానికి ఎంతటి ప్రాముఖ్యతనిస్తున్నారో తెలుస్తోంది.