లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

లోదుస్తుల అమ్మకం పేరుతో మహిళ నగ్న చిత్రాలు మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

Published

on

Woman lured on pretext of ‘free innerwear’, asked to send nude pictures to avail scheme : వ్యాపారానికి ఎన్నెన్నో టెక్నిక్స్ ఉపయోగించి తయారీ దారులు తమ ఉత్పత్తులను అమ్ముకుంటూ ఉంటారు. మహిళల లోదుస్తులు అమ్మే వ్యాపారి ఒకరు తన ఉత్పత్తుల వ్యాపార ప్రచారంలో భాగంగా గతేడాది డిసెంబర్ 3న గుజరాత్, అహమ్మాదాబాద్ లోని ఒక మహిళకు మెసేజ్ పంపించాడు. మెసేజ్ లో ఆ ఉత్పత్తులను ఉచితంగా పొందే అవకాశం ఉందని అతను పేర్కోనటంతో ఆ మహిళ సదరు వ్యక్తితో మాట్లాడింది.

అవతలి వ్యక్తి ఆమె వివరాలు తీసుకున్నాడు. తిరిగి డిసెంబర్ 17న ఆమె ఫోన్ కు మరో మెసేజ్ వచ్చింది. ఉచిత లో దుస్తులు పొందేందుకు ఆమె ఫోటోను అతడి వాట్సప్ కు పంపమని కోరాడు. అతను చెప్పినట్లే తన ఫోటోను ఆవ్యక్తి వాట్సప్ కు పంపించింది. మహిళ ఫోటో రిసీవ్ చేసుకున్న తర్వాత నుంచి మహిళతో అతని ప్రవర్తన మారిపోయింది. ఆమెతో అసభ్యంగా మాట్లాడటం మొదలెట్టాడు.

ఆక్రమంలో ఆమె నగ్న చిత్రాలను కూడా పంపాలని అతను పట్టుబట్టాడు. అతడి ఆలోచన పసిగట్టిన మహిళ కఠినంగా సమాధానం చెప్పింది. దీంతో అతడు ఆమెను బెదిరించటం మొదలెట్టాడు. బాధిత మహిళను అసభ్యంగా వర్ణిస్తూ వాట్సప్ లో మెసేజ్ లు పెట్టటం మొదలెట్టాడు.

ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించసాగాడు. అతడి బెదిరింపులకు లోంగని మహిళ అహమ్మాదాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి ఫోన్ నెంబర్ వ్యాపార సంస్ధల ఆధారాలతో….ఐపీసీ సెక్షన్ 354డీ, పరువు నష్టం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు.

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *