లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జిలు కాల్చివేత

Published

on

Two Women Supreme Court Judges ఓ వైపు తాలిజన్లు-ఆఫ్తాన్ ప్రభుత్వం ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో ఆఫ్గనిస్తాన్ లో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని కాబూల్ లో హింస(VIOLENCE)పెరుగుతోంది. కాబూల్ లో హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గెట్ చేసుకొని వారిపై దాడి చేస్తున్న సంఘటలను పెరుగుతన్నాయి. తాజాగా ఆదివారం జరిగిన దాడిలో ఇద్దరు మహిళా జడ్జిలు మరణించారు.

ఇవాళ ఉదయం కోర్టు వాహనంలో తమ ఆఫీసుకి బయల్దేరిన ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జిలపై ఆయుధాలు ధరించిన దుండగులు కాల్పులు జరిపారని ఆఫ్తాన్ అధికారులు తెలిపారు. దురుదృష్టవశాత్తూ ఈ దాడిలో ఇద్దరు జడ్జిలు మరణించారని..డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని సుప్రీంకోర్టు ప్రతినిధి అహ్మద్ ఫాహిమ్ క్వాయిమ్ తెలిపారు. ఆఫ్తాన్ సుప్రీంకోర్టులో 200మందికి పైగా మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తున్నట్లు అహ్మద్ తెలిపారు.

మరోవైపు, కాబూల్‌ పోలీసులు కూడా ఈ దాడిని ధ్రువీకరించారు.కాల్పులకు తెగబడింది తాలిబన్లేనంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేయగా..ఈ దాడితో తమకు సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించింది. ఆప్గనిస్తాన్ లో తమ బలగాలను 2,500కి తగ్గించినట్లు అమెరికా ప్రకటించిన రెండు రోజుల తర్వాత తాజా దాడి జరిగింది.

కాగా, కొన్ని నెలలుగా ఉన్నత హోదాలోని వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడంపై ఆప్గాన్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. రాజకీయ నాయకులు,జర్నలిస్టులు,యాక్టివిస్ట్ లు,డాక్టర్లు,ప్రాసిక్యూటర్స్ వంటి ముఖ్యమైన ఆఫ్తానీలు కాబూల్ మరియు దేశంలోని ఇతర సిటీల్లో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే,ఈ దాడులన్నింటినీ తాలిబన్లే చేస్తున్నారని ఈ నెల ప్రారంభంలో మొదటిసారి అమెరికా నేరుగా ఆరోపించింది. 2020లో తాలిబన్లు..18వేలకు పైగా దాడులు చేశారని ఈ నెల ప్రారంభంలో ఆఫ్గనిస్తాన్ గూఢచర్య సంస్థ “నేషనల్ డైరక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ” చీఫ్ అహ్మద్ జియా సరాజ్ తెలిపారు.