లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కంగనా ఇంటివద్ద కాల్పుల కలకలం..

Published

on

బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఇంటికి చేరువలో తుపాకీ కాల్పుల చప్పుళ్లు వినపడడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పించారు. వివరాల్లోకి వెళితే.. మనాలీలో కంగన రనౌత్‌కు ఓ సొంత భవంతి ఉంది. ఈ భవంతి సమీపంలో శుక్రవారం రాత్రి 11:30 సమయంలో ఉన్నట్లుండి తుపాకీతో కాల్పులు జరిపిన చప్పుళ్లు వినిపించాయి. అప్పుడు కంగన ఇంటి లోపలే ఉన్నారు.ఊహించని ఈ సంఘటనతో ఖంగారు పడినప్పటికీ వెంటనే స్థానిక పోలీసులకు ఆమె సమాచారమిచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సంఘటన గురించి కంగన మాట్లాడుతూ, తొలుత అవి తుపాకీ చప్పుళ్లు అని అర్థం కాలేదని, అయితే రెండోసారి కూడా వినబడడంతో అర్థం చేసుకున్నానని చెప్పారు. స్థానికులకు డబ్బు ఆశ చూపించి ఎవరో తనను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని కంగన ఆరోపించారు. ఈ దేశంలో విచ్చలవిడిగా గూండాగిరి చేస్తున్నారని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఇలానే భయపడి ఉంటాడని అన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *