నేను ‘గే’ను, నా ఫ్రెండ్‌తో సుఖపడుదవులే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరు జిల్లాలో మరో ఎన్ ఆర్ఐ దారుణం వెలుగు చూసింది. తాను గేనని కట్నం డబ్బులతో పరారయ్యాడు ఓ మోసగాడు. పైగా అమ్మాయి ఇష్టం లేదంటూ పెళ్లైన నెల రోజులకే అమెరికాకు చెక్కేశాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. అమెరికాలో పని చేస్తున్న భాస్కర్ రెడ్డికి ఏటి అగ్రహారానికి చెందిన యువతితో పెళ్లి జరిగింది. అయితే నెల రోజులకే భాస్కర్ రెడ్డి అమెరికాకు వెళ్లి పోయాడు. పెళ్లి సమయంలో 55 సవర్ల బంగారం, రూ.54 లక్షలు కట్నం ఇచ్చినా.. అదనపు కావాలంటూ వేధింపులకు పాల్పడుతూ ఉండటంతో బాధితురాలు పోలీసులకు ఆశ్రయించింది.

మరోవైపు తను గే అని, అమెరికాలో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తనను మానిసికంగా వేధనకు గురి చేశాడని భాస్కర్ రెడ్డి భార్య పోలీసులకు వివరించింది. అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డాడు. 55 లక్షలు కట్నం తీసుకుని కూడా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని బిందుప్రియ అనే అమ్మాయి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
బాధితురాలు..

‘మార్చి 18న భాస్కర్ అనే వ్యక్తితో నాకు పెళ్లైంది. మ్యారేజ్ అయిన నాలుగు రోజులకే ఇంపార్టెంట్ అని చెప్పి అతను ఓపెన్ అయిపోయారు. పేరెంట్స్ ఫోర్స్ చేస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పటికే 31 సంవత్సరాలు వచ్చాయి. మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి కాలేదని అందరూ అడుగుతున్నారు. అందుకని సోసైటీలో స్టేటస్ కోసం నేను నీ మెడలో తాళి కట్టాను. అంతేకన్నా ఏమీలేదు. నాకు యూఎస్ లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. యూఎస్ లో ఇందంతా కామన్. అందుకే నాలుగు సంవత్సరాల నుంచి లివింగ్ రిలేషన్ షిప్ తో ఉన్నాం. నీవు యూఎస్ వస్తే తనతోనే ఉండాలి. తన ద్వారానే బేబీస్ ను ప్రొడ్యూస్ చేయాలి’ అని చెప్పి వేధించారు.

‘నేను దానికి ఒప్పుకోలేదు. నేను మా పేరెంట్స్ కు చెబుతాను అన్నాను. ఒకసారి మా పేరెంట్స్ వచ్చారు. నేను వారికి చెబుతానని..నన్ను ఇంట్లోనే ఉండనిచ్చారు. మా పేరెంట్స్ ను కలవనీయలేదు. తనను టచ్ చేయట్లేదు…నన్ను టచ్ చేయనివ్వట్లేదు. తను ఇంపార్ట్ టెంట్ అని చెప్పారని చెబితే మా పేరెంట్స్ వచ్చి అడిగారు. ఇలాంటప్పుడు అబ్బాయికి ఎందుకు పెళ్లి చేశారు…మా అమ్మాయి జీవితం నాశనం అవుతుందని కదా అని అడిగితే మా పేరెంట్స్ ను బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా బయట చెబితే మిమ్మల్ని స్పాయిల్ చేస్తాను..ఫినిష్ చేస్తాను..నాకు పాతబస్తీలో రౌడీలు చాలా మంది తెలుసని మా మామయ్య బెదిరించారు. పెళ్లైన తర్వాత రెండు నెలలు కలిసి గడిపాము’ అని చెప్పారు.

READ  టిక్ టాక్ ప్రేమ జంట ఆత్మహత్య

‘ఈ రెండు నెలల కాలంలోనే అబ్బాయి ఓపెన్ అయి పోయాడు. మామయ్య, అత్తయ్య, చిన్న ఆడపడుచును అడిగితే మమ్మల్సి ప్రశ్నిస్తున్నావంటూ నన్ను కొట్టారు. నీవు తీసుకొచ్చిన రూ.50 లక్షలకు నీకు మా అబ్బాయి కావాలా అంటూ కొట్టేవాళ్లు. తను వెళ్లాడని చెబుతున్నారు. తను అసలు వెళ్లాడో లేదు నాకు తెలియదు. తను ఇంట్లో నుంచి వెళ్లిన తర్వాత వారం పాటు ఇంట్లోనే ఉన్నాను. బాగానే కాల్ చేసి మాట్లాడారు. నెల తర్వాత కాల్ చేయడం లేదు. తను ఎక్కడున్నా ఇక్కడికి రావాలి.. తను ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో చెప్పాలి. మమ్మల్ని ఎందుకు మోసం చేశాడో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Related Posts