గుంటూరు యువతి నగ్న వీడియోల కేసు.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న వాసిరెడ్డి పద్మ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గుంటూరులో యువతి నగ్న వీడియోల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల కీచక పర్వం సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. తోటి విద్యార్థినితో సన్నిహితంగా ఉంటూ కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి, నగ్న వీడియోలు తీసిన ఇద్దరు యువకులు.. వాటిని అడ్డుపెట్టుకుని కోరిక తీర్చాలని వేధింపులకు గురి చేశారు. తాము చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను ఆన్ లైన్ లో పెడతామంటూ పదే పదే బెదిరింపులకు దిగారు. చివరికి పోర్న్ సైట్ లో, ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ కూడా చేసేశారు. మూడేళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు.

అమ్మాయిలు ధైర్యంగా బయటకు రావాలి:
విద్యార్థిని పట్ల ఆ నీచులు దారుణంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పోలీసులతో జరిగిన ఘటనపై చర్చించామని..మత్తు మందు తాగించి, న్యూడ్ వీడియోలు తీయటం దారుణమన్నారు. విద్యార్థులు ఇంత దారుణంగా వ్యవహరించారంటే బాధ కలుగుతుందని పద్మ అన్నారు. విద్యార్థులు వ్యవహారాలు ఎలా ఉంటున్నాయి అనేది మనకు అర్ధం అవుతుందని తెలిపారు. పరువు పోతుందనో, రోడ్డున పడతామనో భయపడకుండా అమ్మాయిలు ధైర్యంగా దిశ పోలీసు స్టేషన్‌ కు రావాలని ఆమె అన్నారు.

దిశ పీఎస్ లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు:
సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ పోలీస్‌ స్టేషన్ల వల్ల మెరుగైన ఫలితాలు కన్పిస్తున్నాయని వాసిరెడ్డి పద్మ అన్నారు. దిశ పీఎస్‌లో ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. బాధితురాలికి న్యాయం చేయడం, దోషులకు శిక్ష వేయించటమే పని అని తెలిపారు. గుంటూరు ఇంజనీరింగ్‌ విద్యార్థి కేసులో పోలీసులు వెనువెంటనే స్పందిచారని ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోక్సో చట్టంతో పాటుగా ఇతర కేసులు కూడా పెట్టినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో కఠిన శిక్షలు ఉంటాయన్నారు. కేసుని మరింతగా లోతుగా విచారణ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. విద్యార్థులు, ప్రేమ వ్యవహారాలు ఏదైనా దారితప్పితేనే బయటకు వస్తున్నారని…అలాంటి వాటిని ముందుగానే గుర్తించి ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారం రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అని చెప్పామని…అయితే సాంకేతిక పరిజ్ఞానంతో కొంత జాప్యం జరుగుతుందన్నారు. అత్యంత వేగంగా ఛార్జ్‌షీట్ వేయాలని…బెయిల్ రాకముందే పోలీసులు వేగంగా వ్యవహరించాలని పద్మ కోరారు. ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి సంస్థలతో మాట్లాడి న్యూడ్ వీడియోలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ సూచించారు.

ఇన్ స్టాగ్రామ్ లో యువతి నగ్న వీడియోలు:
ఐపీ అడ్రస్‌ ద్వారా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో నగ్న వీడియోలు అప్‌లోడ్‌ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడు వరుణ్ తల్లిదండ్రులు పోలీసుశాఖకు చెందిన వారే అయినప్పటికీ నిందితుడిని అరెస్టు చేశామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. ఎవరి ఒత్తిళ్లు తమపై లేవని స్పష్టం చేశారు, త్వరలో మరికొందరిని అరెస్టు చేస్తామని వెల్లడించారు.

Related Posts