లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశా వర్కర్ మృతి

Published

on

asha worker died in gunturu  district due vaccine reaction : కరోనా వ్యాక్సిన్ వికటించి ఆశా  వర్కర్ మృతి చెందిన విషాద ఘటున ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి   చెందిన ఆశా  వర్కర్ బొక్కా విజయ లక్ష్మి ఈ నెల 19 వ తేదీన కరోనా వ్యాక్సిన్  వేయించు కున్నారు. రెండు రోజులు ఆమె బాగానే ఉన్నట్లు బంధువులు తెలిపారు.

జనవరి 21న తెల్లవారుజామున చలి జ్వరం వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళటంతో వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల వైద్యులు ఆమెకు చికిత్సలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున ఆశా వర్కర్ బోక్కా విజయలక్ష్మి మృతి చెందింది.

వ్యాక్సిన్ వేయించుకున్న మరోక మహిళ  కొలనుకొండ ANM, మల్లెపూడి ఆశా వర్కర్ ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆశా  వర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో కోవిడ్ – 19 వాక్సినేషన్ వేయించుకున్న ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.