లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

‘గుప్కర్ గ్యాంగ్’ గ్లోబల్ గా సాగుతోంది…కశ్మీర్ నేతలపై అమిత్ షా ఆగ్రహం

Published

on

Gupkar Gang Going Global జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆర్టికల్-370రద్దు ఇష్యూలో విదేశీ శక్తుల జోక్యం కోసం కశ్మీర్ పార్టీలు పాకులాడుతున్నాయని అమిత్ షా విమర్శించారు. మహిళలు,దళితుల హక్కులను లాగేసుకొని,కశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదం మరియు మారణహోమం తీసుకురావాలని చూస్తున్నారంటూ గుప్కర్ కూటమిపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓ కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కూటమికి ‘పీపుల్స్ అలియన్స్ ఫర్ గుప్కర్​ డిక్లరేషన్​’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు ముందు…జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగ హోదా కల్పించే ఆర్టికల్-370ని కాపాడుకునేందుకు, దీన్ని అణిచివేయాలని చూసే ఏ చర్యపైనైనా పోరాడేండుకు ఆగస్టు-4,2019న శ్రీనగర్ లోని గుప్కర్ రోడ్ లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(NCP) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నివాసంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న కశ్మీర్ ప్రాంతీయ రాజకీయ పార్టీలు,కాంగ్రెస్… గుప్కర్ డిక్లరేషన్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే.


ఢిల్లీలో మార్కెట్లు మూసివేస్తాం…కేంద్రం అనుమతి కోరిన కేజ్రీవాల్


కాగా,ఇవాళ(నవంబర్-17,2020)వరుస ట్వీట్లతో కశ్మీర్ రాజకీయనాయకులపై,కాంగ్రెస్ నేతలపై అమిత్ షా ఫైర్ అయ్యారు. ఓ ట్వీట్ లో… గుప్కర్ గ్యాంగ్ గ్లోబల్ గా సాగుతోంది! జమ్మూ కాశ్మీర్ లో విదేశీ బలగాలు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. గుప్కర్ ముఠా భారత త్రివర్ణ పతాకాన్ని కూడా అవమానిస్తుంది. గుప్కర్ ముఠా యొక్క ఇటువంటి ఎత్తుగడలకు సోనియా జీ మరియు రాహుల్ జీ మద్దతు ఇస్తు౦దా? వారు భారత ప్రజలకు తమ వైఖరిని స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు.మరో ట్వీట్ లో అమిత్ షా…గుప్కర్ ముఠా జమ్మూ కశ్మీర్ ను తిరిగి ఉగ్రవాదం, అశాంతి శకంలోకి తీసుకెళ్లాలనుకుంటోంది. మహిళలు,దళితుల హక్కులను లాగేసుకోవాలని చూస్తున్నారు. అందుకే అన్ని చోట్లా ప్రజలు వారిని తిరస్కరిస్తున్నారని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.జమ్మూ కశ్మీర్ ఎప్పుడూ భారత్ లో అంతర్భాగమేనని, అలాగే కొనసాగుతుందని మరో ట్వీట్ లో అమిత్ షా తెలిపారు. మన జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అపవిత్ర ‘గ్లోబల్ ఘట్ బంధన్’ సంకీర్ణాలను భారత ప్రజలు ఇక ఏమాత్రం సహించరు. నేషనల్ మూడ్ తో గుప్కార్ ముఠా ప్రవాహమా లేదా ప్రజలు దానిని బొందపెట్టడం జరుగుతుందని అమిత్ షా మరో ట్వీట్ లో తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *