ఎవరీ గుప్తేశ్వర్ పాండే.. రియల్ లైఫ్ ఐపీఎస్ గబ్బర్‌సింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే.. వికాస్ దూబే ఎన్‌కౌంటర్ తర్వాత అంతకుముందే ఆ గ్యాంగ్‌స్టర్‌కు ఇచ్చిన వార్నింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అతను రాష్ట్రంలో అడుగుపెడితే సింహంలా వేటాడతాం. అని సపరేట్ స్టైల్ లో చెప్పారు. దూబేను బ్రహ్మానోం కా షేర్ అని అంటారట కదా అని పాండే సెటైర్ వేశారు. వారు పుట్టిన కులాలే వారిని క్రిమినల్స్ గా ప్రోత్సహిస్తుంటాయి. నేరస్థుల సంప్రదాయం ఇలానే ఉంటుంది.

రేప్‌లు చేసినా, మర్డర్లు చేసినా, హీనమైన నేరాలకు పాల్పడినా వెనకేసుకొస్తుంటారు. నేరస్థుల పేర్లు జపం చేస్తూ ఏదో ఒకటి అడుక్కుంటూ వారిని పెద్ద మనుషులు చేస్తారు. ఇదే క్రైం కల్చర్. అని పాండే కీలక కామెంట్లు చేశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత పాండే ఓ ధైర్యమైన హీరో అని పొగిడేస్తున్నారు నెటిజన్లు.

పాండే కామెంట్లు, పొగడ్తలు ఇది తొలిసారేం కాదు. గతేడాది డిసెంబరులోనూ ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. పాండే క్రిమినల్స్ కు కులం, మతం సపోర్ట్ చేస్తూ వారికి వెల్ కమ్ చెప్తుంటారని నేరాలను ఇలాగే సపోర్ట్ చేస్తుంటారని అన్నారు. 1987 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ కు ఇలాంటివి షరా మామూలే. అనుకున్నదానికంటే విభిన్నంగా చేసి ఎప్పుడూ ఫుల్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంటారు పాండే.

ఫేస్‌బుక్‌లో ఇప్పిటకే 7లక్షల ఫాలోవర్లను సంపాదించిన పాండే.. ఆయన యాక్టివిటీలు మరింత పబ్లిసిటీని తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు గుప్తేశ్వర్ పాండేకు సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో పాటలు, డ్రై చపాతీలను ఉప్పు, మిర్చితో ఎలా తినాలి వంటి వాటితో పాటు మరింత దగ్గరయ్యారు నెటిజన్లకు. ఆ తర్వాతి వీడియోలో అతనేదో ఆధ్యాత్మిక స్పీకర్ అని అనుకునేలా ఉంది. కానీ అందులో కేవలం ఆత్మనే అని అంతకుమించి ఏం లేదని చెప్పుకొచ్చారు పాండే.

బీహార్ వాసి అయిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం జరిగిన రోజు పాండే ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి క్యాప్షన్ పెట్టారు. ‘ఇది హార్ట్ బ్రేకింగ్ విషయం. నా కళ్లు చెమరుస్తున్నాయి. అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు. నేను మాట్లాడే స్థితిలో లేను. ఓ సితార.. మన కళ్ల నక్షత్రం. సమయాని కంటే ముందే రాలిపోయింది అని రాసుకొచ్చారు. ఈ పాపులర్ ఐపీఎస్ ఆఫీసర్ తనపై లైమ్ లైట్ ఎలా ఉంచుకోవాలో ఆయనకు తెలుసని వందల మంది చెప్తుంటారు.

Related Posts