పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్లి కత్తులతో పొడుచుకుని చంపుకున్నారు!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పెళ్లి మాటల కోసం వెళ్లిన వారు తీపి కబురుతో వస్తారనుకుంటారు. ఇక్కడ కథ అడ్డం తిరిగింది. అమ్మాయి తండ్రి కత్తిపోటుకు గురై చనిపోయాడు. గురువారం సాయంత్రం జరిగిన ఘటనతో ఆ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్.. హింసాత్మకంగా మారింది. రాజస్థాన్ లోని సోనా ప్రాంతంలో రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇద్దరు కొడుకులతో పాటు భార్యను తీసుకుని బాధితుడు తన కూతురికి సంబంధం కోసమని పెళ్లికొడుకు ఇంటికి వెళ్లారు. కొడుకుకు తెలిసిన వాళ్లు కావడంతో అటువైపు కుటుంబాన్ని పరిచయం చేశాడు. గుర్‌గావ్‌లో ఆ వ్యక్తి కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

‘పెళ్లి మాటలు ముగిసి వివాదం చెలరేగింది. తన కూతుర్ని ఆ కుటుంబానికి ఇచ్చేది లేదంటూ మొండికేసి చెప్పాడు. ఆ తర్వాత ఆర్గ్యూమెంట్ వేడెక్కింది. పెళ్లికొడుకు తండ్రి కత్తితీసుకుని వియ్యంకుడు కావాలసిన వ్యక్తి పొట్టలో పలుమార్లు పొడిచాడు’ అని గుర్‌గావ్ పోలీసు అధికారి పీఆర్ఓ సుభాష్ చెప్పారు.

బాధితుడ్ని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఆరుగురి వల్లనే హింస చెలరేగిందని.. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.

Related Posts