ప్రియుడితో యువతి బెడ్ పై ఉండగా వీడియో తీశారు, దాన్ని అడ్డుపెట్టుకుని అనేకసార్లు గ్యాంగ్ రేప్ చేశారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం చోటు చేసుకుంది. కొందరు నీచులు కామాంధులుగా మారారు. ఓ వీడియోని అడ్డం పెట్టుకుని యువతిని పలుమార్లు గ్యాంగ్ రేప్ చేశారు. వారి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన ప్రియుడితో కలిసి రిసార్ట్ కి వెళ్లింది. బెడ్ పై అతడితో శృంగారంలో మునిగి తేలింది. అదే సమయంలో వారిని గమనించిన కొందరు యువకులు అదంతా వీడియో తీశారు. ఆ తర్వాత వీడియో చూపించి యువతిని బెదిరించారు. అలా ఆమెపై అనేకసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.వీడియో తీసి బ్లాక్ మెయిల్:
గురుగ్రామ్ కు చెందిన యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోంది. మూడు నెలల క్రితం బాయ్ ఫ్రెండ్ తో కలిసి రిసార్టుకి వెళ్లింది. అక్కడ ఓ గదిని ఆ ప్రేమ జంట అద్దెకు తీసుకుంది. ఇద్దరూ శృంగారంలో మునిగి తేలారు. కాగా, గదిలో జరిగే తతంగాన్ని కిటికీ నుంచి చూసిన రూపేష్, శంకర్, రాజా అనే యువకులు దాన్ని రహస్యంగా సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఆ తర్వాత వీడియోని యువతికి పంపారు. తమ మాట వినకపోతే సోషల్ మీడియాలో పెడతామని వార్నింగ్ ఇచ్చారు. భయపడిన యువతి మౌనంగా ఉండిపోయింది. ఇదే అదనుగా ఆ కామాంధులు అనేకసార్లు యువతిని గ్యాంగ్ రేప్ చేశారు.అనేకమార్లు గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు:
ఆ వీడియో బయటపడితే కుటుంబం పరువు పోతుందని భావించిన యువతి వారు పిలిచినప్పుడల్లా వెళ్లి ఆ కామాంధుల చేతిలో నలిగిపోయింది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయిన బాధితురాలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మూడో వాడి కోసం గాలిస్తున్నారు.

Related Tags :

Related Posts :