Home » ఫోన్లో డేటా చోరీ చేసిన హ్యాకర్లు.. రూ.10కోట్లు బ్లాక్ మెయిల్
Published
1 month agoon
Hackers: ఘాజియాబాద్ లోని ఓ వ్యక్తికి ఫోన్ కాల్ వచ్చింది. తన పర్సనల్ డేటా (పిక్చర్లు, ఫ్యామిలీ పర్సనల్ వివరాలు) ఆన్లైన్లో పెట్టేస్తామని.. మా డిమాండ్ కు ఒప్పుకుని రూ.10కోట్లు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అంతే.. ఆ వ్యక్తి తనకు సహాయం కావాలంటూ పోలీసులను సంప్రదించాడు. ఘాజియాబాద్ లోని వసుంధర కాలనీకి చెందిన వ్యక్తి ఈమెయిల్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది.
రాజీవ్ కుమార్ రూ.10కోట్లు ఇవ్వలేకపోతే అతని వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించారు. దీనిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం.. క్రిమినల్ చర్యలగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఐటీచట్టం ప్రకారం కూడా కేసు నమోదైంది.
ఈ మేరకు హ్యాకర్లు ఆ కుటుంబాన్ని గమినిస్తూనే ఉన్నారని.. కొంతకాలంగా వారి యాక్టివిటీలను పసిగడుతూ వేదింపులకు గురిచేస్తున్నారంటూ ఆరోపించారు. సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు హ్యాకర్లను పట్టుకునే పనిలో పడ్డారని అధికారులు చెప్తున్నారు.
మీ కంప్యూటర్‌పై హ్యాకర్లు ఎంత సింపుల్‌గా ఎటాక్ చేస్తారంటే! మరి ఎలా తప్పించుకోవాలి?
గేమ్‌లో భాగంగా బాలిక దుస్తులు విప్పించాడు, ఆ తర్వాత బ్లాక్ మెయిల్‌కి దిగిన 13ఏళ్ల బాలుడు
మీ నగ్న చిత్రాలు అడుగుతారు, సోషల్ మీడియా వాడే వారికి పోలీసుల వార్నింగ్
పోయిన పెన్ డ్రైవ్ లో ఆ ఫోటోలు–రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్న నిందితుడు
లైంగిక వేధింపులతో మహిళా ఎస్సై ఆత్మహత్య -ఫిజికల్ ట్రైనర్ అరెస్ట్
మంత్రి వివరణ : నేను అత్యాచారం చేయలేదు..మేం రిలేషన్లో ఉన్నాం..డబ్బుల కోసమే బ్లాక్ మెయిల్