లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

మహిళా అధికారిణిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు..వీడియో వైరల్

Published

on

MLA Threatens Madhya Pradesh Officer : మహిళవి అయిపోయావు..ఈ స్థానంలో మరో పురుష అధికారి ఉంటేనా..గల్లా పట్టుకుని మరి ఇచ్చేవాడిని అంటూ..కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సంబంధిత ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే…

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇంకా చల్లారకముందే..మహిళా అధికారిపై ఇదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కేంద్రం ఇటీవలే తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..రైతులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. 50 రోజులకు పైగానే..ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతున్నారు. మధ్యప్రదేశ్ – రాజస్థాన్ సరిహధ్దు సమీపంలోని సైలానా పట్టణంలో ఆదివారం రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ నేతృత్వంలో..SDM కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడ sub-divisional magistrate (SDM) కామిని ఠాకూర్ కు మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే..కామిని ఠాకూర్ బయటకు రాకపోవడంపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గం ప్రతినిధి..నా మాటను అర్థం చేసుకోవడం లేదంటూ..అధికారి కామినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీరొక మహిళా అధికారి అయిపోయారు..ఈ స్థానంలో మరో పురుష అధికారి ఉంటే..గల్లా పట్టుకుని మరీ..ఇచ్చే వాడిని అంటూ రెచ్చిపోయారు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.