లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

భారత పౌరసత్వం ఇస్తామంటే సగం బంగ్లాదేశ్ ఖాళీ

పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని

Published

on

half Of Bangladesh Will Be Empty

పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని

పౌరసత్వ సవరణ చట్టం(CAA) గురించి దేశం మొత్తం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. సీఏఏ రాజ్యాంగ విరుద్ధం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మతం పేరుతో దేశాన్ని విభజించే కుట్ర జరుగుతోందని కేంద్రంపై మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సీఏఏ అమలు చేసేది లేదని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాయి. కాగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం సీఏఏ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం లేదని చెబుతోంది. సీఏఏ పౌరసత్వం ఇచ్చేదే కానీ.. లాక్కునేది కాదని పదే పదే స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేవని బీజేపీ ప్రభుత్వం వెల్లడించింది. పొరుగు దేశాల్లో మత వివక్షకు గురైన మైనార్టీలను ఆదుకునేందకు సీఏఏ తీసుకొచ్చామని వివరించింది.

తాజాగా సీఏఏ గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత పౌరసత్వం ఇస్తామని వాగ్దానం చేస్తే.. సగం మంది బంగ్లాదేశీలు భారత్‌లో చేరిపోతారని ఆయన అన్నారు. దీంతో సగం బంగ్లాదేశ్ ఖాళీ అయిపోతుందన్నారు. మరి అలా వలస వచ్చిన వారి బాధ్యత ఎవరు తీసుకుంటారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. వారి బాధ్యత కేసీఆర్ తీసుకుంటారా? రాహుల్ గాంధీ తీసుకుంటారా? అని కిషన్ రెడ్డి నిలదీశారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. సీఏఏ గురించి మాట్లాడారు.

సీఏఏ నిర్ణయం నూటికి నూరు శాతం తప్పని, సెక్యులర్ పార్టీగా తాము ఈ చట్టానికి పూర్తి వ్యతిరేకమని తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఏఏ బిల్లు భారతీయులకు వ్యతిరేకమని నిరూపించాలని సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో మత పరంగా ఇబ్బందులు పడుతున్న మైనార్టీల గురించి మానవతా కోణంలో ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం సీఏఏ తీసుకొచ్చిందని కిషన్ రెడ్డి చెప్పారు. కొన్ని పార్టీలు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఏఏని వ్యతిరేకిస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఏఏ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, విద్వేషాలు నింపుతున్నారని ఆగ్రహించారు.