లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

హ్యాపీ బర్త్‌డే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

Published

on

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. మెగా క్యాంప్‌లో ఉన్న సోకాల్డ్ కమర్షియల్ హీరోల్లా కాకుండా సమ్‌థింగ్ డిఫరెంట్‌గా సినిమాలు చేస్తున్నారు. సినిమాలు జస్ట్ కౌంట్ చేసుకోడానికి కాకుండా సెలక్టివ్‌గా చేస్తూ.. ప్రతి సినిమాలో ఏదో ఒక ఇంట్రస్టింగ్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తూ తనలోని వేరియేషన్‌ని ఆడియన్స్‌కి చూపిస్తున్నారు ఈ క్యూట్ హీరో.

వరుణ్ తేజ్.. హీరోగానే కాదు.. నటుడిగా చాలా ఇంప్రూవ్ అయ్యారు వరుణ్. ప్రతి సినిమాలో తన లుక్ వైజ్, యాక్టింగ్ వైజ్ డిఫరెన్స్‌ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్ట్‌‌గా తన 10 వ సినిమాలో బాక్సర్‌గా తనలోని మరో యాక్షన్ యాంగిల్‌ని చూపించబోతున్నారు. అంతేకాదు ‘గని’ గా ఫ్రెష్ లుక్, ఇంప్రూవ్డ్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని పలకరించబోతున్నారు.

Varun Tej

కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధిచిన టైటిల్ అండ్ ఫస్ట్ ‌లక్ పోస్టర్ మంగళవారం వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చేతులమీదుగా విడుదలైంది.

వరుణ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి సినిమాలో వేరియేషన్ చూపిస్తూనే ఉన్నారు. తనకు ఫస్ట్ హిట్ ఇచ్చిన ‘కంచె’ సినిమాలో తన ఏజ్‌కి మించిన ఎమోషనల్ క్యారెక్టర్‌లో మెచ్యూర్డ్‌గా కనిపించే ప్రయత్నం చేశారు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ సినిమాలో సెన్సిటివ్ లవర్‌గా చాలా ఎమోషన్స్‌ని చూపించి సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేశారు. ‘లోఫర్’ సినిమాలో అప్పటి వరకూ చేసిన క్యారెక్టర్లకి డిఫరెంట్‌గా కేర్ లెస్ యాటిట్యూడ్‌తో రఫ్ నెస్ ను చూపించారు. ‘లోఫర్’ లో రఫ్‌గా కనిపిస్తే ‘ఎఫ్ 2’ సినిమాలో మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ని ఫుల్‌గా చూపించారు వరుణ్.

Ghani

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గనుంచి డిఫరెంట్ సినిమాలు, క్యారెక్టర్లు చేస్తున్న వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో చాలా కొత్తగా కనిపించి సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పటి వరకూ తనకున్న క్యూట్ లుక్ నుంచి కంప్లీట్ మాస్ జానర్‌కి మారిపోయారు. ఇలా సో కాల్డ్ హీరోగానే కాకుండా కొత్త జానర్స్ ట్రై చేస్తూ.. తనలోని యాక్టింగ్ యాంగిల్స్‌ని ఆడియన్స్‌కి ఎంటర్‌‌టైనింగ్‌గా చూపిస్తున్నాడు. ఈ ‘గని’ సినిమాలో కూడా ఆడియన్స్‌కి కొత్తదనాన్ని చూపిస్తానంటున్నారు వరుణ్ తేజ్.