హ్యాపీ బర్త్‌డే ‘రియల్ స్టార్’ ఉపేంద్ర

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Happy Birthday Upendra: ఉపేంద్ర.. ‘A’ అనే ఒకే ఒక్క సినిమాతో సౌత్‌ ఇండస్ట్రీని షేక్ చేసేశారు. పేరుకి కన్నడ పరిశ్రమకు చెందిన వారైనా తెలుగు, తమిళ్ వంటి ఇండస్ట్రీలలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. సెప్టెంబర్ 18 ఉపేంద్ర పుట్టినరోజు. నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర మార్కే వేరు.. వర్తమానాన్ని ప్రశ్నించడం, భవిష్యత్తుని ఊహించడం, ప్రేక్షకుడి ప్రవర్తనని తెరమీద చూపించడం ఉపేంద్ర స్టైల్.. టెక్నాలజీ పరంగానూ, కాన్సెప్ట్ పరంగానూ, నటన పరంగానూ ఆయన ఎప్పుడూ ప్రయోగాలనే ఇష్టపడతారు.


1989లో ‘అనంతన అవంతర’ అనే కన్నడ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఉపేంద్ర 1992లో ‘తార్లే నాన్ మగ’ అనే మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. శివరాజ్ కుమార్‌తో చేసిన ‘ఓం’ మూవీతో డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఈ సినిమా తెలుగులో ‘ఓంకారం’ పేరుతో ఉపేంద్ర దర్శకత్వంలోనే రాజశేఖర్ హీరోగా రీమేక్ అయ్యింది.


‘A, ఉపేంద్ర, కన్యాదానం, రా, H2O, హాలీవుడ్, రక్త కన్నీరు, ఒకేమాట, సూపర్, సెల్యూట్, ఉపేంద్ర 2, సన్నాఫ్ సత్యమూర్తి, ముకుందా మురారి, ఐ లవ్ యు’.. ఇలా ఎన్నో మూవీస్‌లో యాక్టర్‌గా, డైరెక్టర్‌గా తన మార్క్ చూపించారు ఉపేంద్ర.. 30 ఏళ్ల సినీ ప్రయాణంలో వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.


గతంలో కన్నడ పరిశ్రమ ఆయణ్ణి దర్శకుడిగా 10 సంవత్సరాల పాటు నిషేదించింది. అయినా తన ప్రయత్నాలు, ప్రయోగాలు ఆపలేదు.. సౌత్ ఇండియాలో మంచి యాక్టర్, డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర.. ఎందరో అప్‌కమింగ్ యంగ్‌స్టర్స్‌కి, ఫిల్మ్ మేకర్స్‌కి ఆదర్శంగా నిలిచారు.


ప్రస్తుతం కన్నడలో ‘కబ్జ’ అనే పాన్ ఇండిమా చిత్రంతో పాటు ‘త్రిశూలం’ అనే మరో సినిమాలోనూ అలాగే తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్న ‘రియల్ స్టార్’ ఉపేంద్ర ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ ప్రారంభించి క్రీయాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు.


Related Posts