లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

అప్‌డేట్స్‌తో అదరగొడుతున్నారుగా!

Published

on

Most Elgible Bachelor: నేచురల్ స్టార్ నాని తన 28వ సినిమాను ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నాని 28వ సినిమా రూపొందనుంది. ‘మెంటల్‌ మదిలో, బ్రోచెవారెవరురా’ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. మలయాళీ హీరోయిన్‌ నజ్రీయా నజీమ్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ కర్టెన్ రైజర్‌కు సంబంధించి మరిన్ని వివరాలను ఈ నెల 21 న తెలియజేయనున్నట్లు నిర్మాణ సంస్థ తెలియజేసింది. తన 26వ చిత్రం ‘టక్‌ జగదీష్‌’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న నాని, 27వ చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకుడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్.

విజయ్ రాఘవన్‌గా విజయ్ ఆంటోని
విభిన్నమైన చిత్రాలతో తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన ఆనంద కృష్ణన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కోడియిల్‌ ఒరువన్‌(కోటికొక్కడు అని అర్థం)’.. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజయ రాఘవన్‌’ పేరుతో విడుదల చేస్తున్నారు.

దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఎత్తైన భవనాల సముదాయంపై స్టైల్‌గా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న విజయ్‌ ఆంటోని ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

బ్యాచిలర్ విషెస్
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు.

పూజా చిచ్చుబుడ్డి వెలిగిస్తుండగా అకిల్ ఆమె చేయి పట్టుకుని ఉన్న లుక్ ఆకట్టుకునేలా ఉంది. అఖిల్, పూజాల పెయిర్ చూడచక్కగా ఉంది. 2021 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Nani 28Vijaya Raghavan

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *