లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Uncategorized

స్నేహితుల దినోత్సవం-2020: మీ స్నేహితులకు ఈ ప్రత్యేక మెసేజ్‌లను పంపండి

Published

on

happy-friendship-day-2020-wishes-greetings-to-share-with-friends

స్నేహం ఓ మధురమైన అనుభూతి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో చెప్పుకుంటాం. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావు. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు.స్నేహితులు ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉండేవారు. మీరు నవ్వుతున్నప్పుడు, వారి ముఖంలో ఒక నవ్వు ఉంటుంది మరియు మీరు నిరాశకు గురైనప్పుడు, వారు కూడా ఆందోళనలో ఉంటారు. మీ జీవితంలోని ప్రతి క్షణం తెలిసిన వ్యక్తి మీ నిజమైన స్నేహితుడు అని చెప్పుకోవచ్చు. అటువంటి నిజమైన స్నేహితుడు మీ జీవితంలో ఉంటే మీరు అదృష్టవంతులే.

స్నేహితుల దినోత్సవం ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు. ఈసారి ఆగస్టు 2 ‘స్నేహితుల దినోత్సవం’ వచ్చింది. వాస్తవానికి ప్రతి ఏడాది అందరూ చాలా ఉత్సాహంగా చేసుకునే ఈరోజు ఈసారి మాత్రం కరోనా కారణంగా పెద్దగా జరగట్లేదు. అటువంటి పరిస్థితిలో, మీ స్నేహితుల కోసం ప్రత్యేక సందేశాలను పంపడం ద్వారా, మీరు మీ స్నేహాన్ని మరింత బలంగా వ్యక్తపరిచినట్లు అవుతుంది.ఫ్రెండ్ లేనివాడు ఒక అనాథ అంటూ ప్రెంచ్ భాషలో సామెత ఉంది. ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకరినొకరు ఇచ్చుకునే బహుమతులలో ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ కీలక పాత్రను పోషిస్తుంటాయి. అందమైన బంధానికి గుర్తుగా నిలిచే స్నేహితుల దినోత్సవం సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులందరికీ ‘ఫ్రెండ్ షిప్ డే’ శుభాకాంక్షలు..

కొన్ని సందేశాలు:నా నవ్వును గుర్తించేందుకు.. నా తప్పును మన్నించేందుకు..
ఆ దేవుడు నా కోసం పుట్టించింది స్నేహితుడిని..

మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహితుడు ఒకరుండాలి.. అటువంటి విలువైన స్నేహితుడిని నీ రూపంలో నాకు ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు..

‘నువ్వు పెదవి విప్పి ఒక్కమాట చెప్పకపోయినా నీ మౌనం వెనుక ఉన్న బాధని అర్ధం చేసుకోగలవాడే నిజమైన స్నేహితుడు’నవ్వు అన్నది ఇక నా జీవితానికి ఒక గతం మాత్రమే అని నమ్మిన మనసుని మళ్ళీ నవ్వేలా చేసినది ఒక స్నేహం మాత్రమే..

బాష లేనిది బంధం ఉన్నది సృష్టిలో అతి మదురమైనది జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *