Home » గణతంత్ర వేడుకల్లో సెలబ్రిటీలు
Published
1 month agoon
Republic Day 2021: 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ జెండా వందనం చేస్తూ.. జాతీయ గీతాన్నాలపిస్తూ తమ దేశ భక్తిని చాటుకుంటున్నారు. సెలబ్రిటీలు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నటసింహం, ఆసుపత్రి ఛైర్మన్, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు భారతీయులకు, తెలుగు ప్రజలకు 72 వ రిపబ్లిక్ డే విషెస్ తెలియజేశారు.