లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఇండియాలో జనవరి నుంచి హార్లీ డేవిడ్‌సన్ అమ్మకాలు

Published

on

Harley Davidson మోటార్ సైకిల్ అమ్మకాలను జనవరి 2021నుంచి మొదలుపెట్టనుంది ఆ సంస్థ. ఈ మేరకు శనివారం ప్రకటన చేస్తూ సేల్ సర్వీసెస్ కొనసాగిస్తున్నట్లు చెప్పింది. గత నెలలోనే హార్లీ డేవిడ్‌సన్, హీరో మోటోకార్ప్ తో ఒప్పందం కుదుర్చుకుని ఇండియాలో సంయుక్తంగా సేవలు అందించనున్నట్లు తెలిపింది.

మేనేజింగ్ డైరక్టర్ సజీవ్ రాజేశేఖరన్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో మా బిజినెస్ మోడల్ మార్చుకున్నప్పుడు.. హీరో మోటాకార్ప్ తో కలిసి ఇండియాలో మా ప్రయాణం కొనసాగించాలనుకున్నాం. మా రైడర్లకు మరింత దగ్గరగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. హార్లీ డేవిడ్‌సన్ బైక్ విడి భాగాలు అందుబాటులో ఉంటాయని, సేల్ సర్వీసెస్, వారంటీ సేవలను జనవరి 2021నుంచి అందించనున్నాం’ అని ఆయన అన్నారు.డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ ప్రకారం.. హీరో మోటోకార్ప్.. హార్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిల్స్ అమ్మకాలు, సర్వీసులు రెండూ చూసుకుంటుంది. లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రకారం.. హీరో మోటా కార్ప్ ప్రీమియం మోటార్ సైకిల్స్‌ను హార్లీ డేవిడ్‌సన్ పేరు మీదనే అమ్మాల్సి ఉంటుంది.