చనిపోతూ తనను చంపినవాళ్ల కారు నంబర్ చేతిమీద రాసుకున్న పోలీస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

చనిపోతూ కూడా ఓ పోలీస్ కానిస్టేబుల్ తన వృత్తి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. కన్నుమూసే సమయంలో కూడా సమయస్ఫూర్తితో తన చావుకు కారణమైన హంతకులను పట్టించాడు. ఈ ఘటన హరియాణా లోని సోనిపట్ జిల్లాలోని గోహానా-జింద్ రహదారిపై తెల్లవారుజామున బుటానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళితే..బుటానా సమీపంలో ఉన్న సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కారును పార్క్ చేసి రోడ్డుపైనే మద్యం తాగుతున్నారు. అది చూసిన డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్‌ కప్తాన్‌ సింగ్(43), రవీందర్‌ సింగ్(28)‌ వారిని ప్రశ్నించారు. రోడ్డు పక్కన మద్యంతాగకూడదని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న మందుబాబులు ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోయారు. ఓ కానిస్టేబుల్ పై దాడికి దిగారు.

అలా కానిస్టేబుల్స్ కు మందుబాబులకు మధ్య జరిగిన ఘర్షణలో రవీందర్‌ సింగ్‌, కప్తాన్‌ సింగ్‌ అక్కడికక్కడే మరణించారు. అలా వారి చేసిన దాడిలో చనిపోయే ముందు కానిస్టేబుల్ రవీందర్‌ సింగ్‌ తన చేతిపై తమపై దాడి చేసిన దుండగుల కారు నంబర్‌ని రాసుకున్నాడు. అతని సిన్సియారిటీయే సదరు దుండగులను పట్టించింది.

కానిస్టేబుల్స్ పై కొంతమంది దాడి చేశారని సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకున్నరు. అక్కడికి వచ్చిన పోలీసులకు చనిపోయిన పడిఉన్నకానిస్టేబుల్స్ ను చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. దుండగులను ఎలాగైనాసరే పట్టుకోవాలనుకున్నారు.పోలీసులు రవీందర్‌ చేతి మీద ఉన్న రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా విచారణ చేపట్టి దుండగులను పట్టుకున్నారు.

ఈ ఘటన గురించి హరియాణా పోలీసు చీఫ్‌ మనోజ్‌ యాదవ్ మాట్లాడుతూ..‘చనిపోయే ముందు మా పోలీస్‌ కానిస్టేబుల్‌ రవీందర్‌ సింగ్‌ చూపిన సమయస్ఫూర్తి అభినందనీయం. చనిపోయే ముందు రవీందర్‌ సింగ్‌ హంతకుల కారు నంబర్‌ని తన చేతి మీద రాసుకున్నాడు. లేదంటే నిందితులను పట్టుకునేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.’ అని తెలిపారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. అనంతరం విచారణ ముమ్మరం చేశారు.

Related Posts