Home » మద్యం ఆశ చూపి మర్డర్లు : నేనేంటో నిరూపించటానికేనన్న సైకో కిల్లర్
Published
3 months agoon
By
nagamaniHaryana : Gurugram Police Arrests psycho killer : అతనో సైకో కిల్లర్. మద్యం తాగుతామని తీసుకెళ్లి చంపేస్తుంటాడు. అలా రోజుకొకరి ప్రాణాలు తీసేసేవాడు. అలా వరుసగా మూడు రోజులు ముగ్గురు ప్రాణాలు తీసేశాడు. వరుస హత్యలతో పోలీసులతో గురుగ్రామ్ లో అటు పోలీసులకు..ఇటు సామాన్య జనాలకు పక్కలో బల్లెంతా తయారయ్యారు సదరు సైకో. దీంతో పోలీసులు అతడిని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను నియమించి ఎట్టకేలకు పట్టుకున్నారు. అనంతరం విచారించగా…అతను చెప్పిన వివరాలు విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళితే..గురుగ్రామ్ పోలీసులు మహ్మద్ రాజీ అనే 22 ఏళ్ల యువకుడ్ని అరెస్ట్ చేశారు. మహ్మద్ రాజీ మామూలోడు కాదు..సునాయాసంగా హత్యలు చేసేస్తుంటాడు. మద్యం తాగుతామని తీసుకెళ్లి చంపేస్తుంటాడు. ఓ పెగ్ తాగినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాడు. అలా వరుసగా మూడు రాత్రుల్లో ముగ్గుర్ని హత్య చేశాడు. దీంతో ఆ సైకో కిల్లర్ ని పట్టుకోవటానికి పోలీసులు సాగించిన వేటలో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు మహ్మద్ రాజీ. గురుగ్రామ్ లో గత నవంబర్ 23,2020 నుంచి 25 వరకు రోజుకు ఒకర్ని చొప్పున ముగ్గురిని గొంతుకోసి చంపేశాడు. మద్యం ఆశ చూపించి..ఆకర్షించి హతమార్చడం మహ్మద్ రాజీ స్టైల్.
అలా వారిని చంపేశాక..శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. తల ఒకచోట, మొండెం మరో చోట పారేస్తాడు. తలలు ఒకచోట..మొండాలు మరోచోట కనిపిస్తుండటంతో గురుగ్రామ్ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు సదరు హంతకుడిని పట్టుకోవటాన్ని సవాల్ గా తీసుకున్నారు. ఈ వరుస హత్యలు సంచలనం సృష్టించాయి. దీంతో తో పోలీసులు ఈ కేసును ఓ సవాల్ గా తీసుకుని ఛేదించారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా మహ్మద్ రాజీని ఇఫ్కో చౌక్ సమీపంలో అరెస్ట్ చేశారు. ఇంటరాగేషన్ లో అతడు చెప్పిన వివరాలు విన్న పోలీసులు షాక్ అయ్యారు. మానసిక ఉన్మాదిగా గుర్తించారు.
మహ్మద్ రాజీ చిన్ననాటినుంచి తనకు బైటి ప్రపంచం గురించి ఏమీ తెలీదనీ..చాలా బలహీనంగా ఉండేవాడిననీ తెలిపాడు. తన చిన్ననాటినుంచి లైంగిక వేధింపులకు గురయ్యానని.. సన్నగా పీలగా ఉండటంతో తనను అందరూ ఎగతాళి చేసేవారనీ..ఎందుకు పనికిరానివాడినని హేళన చేసేవారని పోలీసులకు తెలిపాడు. కానీ తాను కూడా ఏదోకటి చేసి తనేంటో నిరూపించాలనుకున్నాడు. తాను ఏంచేయగలనో అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాడు. అందుకే తనను అందరూ గుర్తించాలని..తను చేసే పనులు చూసి జనాలు భయపడాలని అనుకున్నాడు. అందుకే ఇలా..హత్యలలు చేశానని చెప్పాడు. అలా 100 హత్యలు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నానని తెలిపాడు.
తనను తాను బలహీనుడ్ని కాదని బలవంతుడినని నిరూపించటానికి మనుషుల గొంతు కోస్తున్నాననీ..ఓ హత్య చేయటమంటే మాటలు కాదు..చాలా ధైర్యంకావాలి.. సదరు వ్యక్తిని గట్టిగా పట్టుకోవాలి..అతను గింజుకుంటుంటే నొక్కి పెట్టాలని చెప్పాడు. కానీ గొంతులు కోస్తుంటే తనకు సంతోషంగా ఉంటుందని..నన్ను చంపొద్దని వాళ్లు వేడుకుంటుంటే ఇంకా సంతోషంగా ఉండేదని అందుకే హత్యలు చేశానని చెప్పాడు.
వాళ్లు గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోతుండటం చూస్తుంటే..చూసి వారి బాధను..భయాన్ని చూసి చక్కగా ఆస్వాదించేవాడ్నని తెలిపాడు. అతడి మనస్తత్వం గురించి తెలుసుకన్న పోలీసులకే వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఒక్కొక్క మాటా అతను చెబుతుంటే పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మహ్మద్ రాజీ బీహార్ లోని అరియారియా జిల్లాలోని ఖలీలాబాద్ గ్రామానికి చెందినవాడిగా గురుగ్రామ్ పోలీసులు గుర్తించారు. పోలీసులు అరెస్ట్ తరువాత అహ్మద్ ను ‘‘సైకో రాజి’’గా పోలీసులు పిలుస్తున్నారు. మహ్మద్ రాజీ ఢిల్లీ.. హర్యానా సరిహద్దులోను బీహార్ లోనూ హత్యలకు పాల్పడడ్డాడని పోలీసులు తెలిపారు.