లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వాలంటీర్ గా “కోవాగ్జిన్” ట్రయిల్ టీకా వేయించుకున్న మంత్రి

Published

on

Haryana Health Minister కరోనా వైరస్ ని అంతమొందించేందుకు భారత్​ బయోటెక్​ సంస్థ “కొవాగ్జిన్​ టీకా”ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. కాగా, ఇవాళ(నవంబర్-20,2020)’కొవాగ్జిన్’‌ మూడో దశ ప్రయోగాలు హర్యాణాలో ప్రారంభమయ్యాయి.ఈ టీకా కోసం హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్.. వాలంటీర్‌గా మారారు. మూడో దశ ప్రయోగాలకు సంబంధించి తొలి టీకాను ఆయనే వేయించుకున్నారు. అంబాలాలోని కాంట్​ సివిల్ హాస్పిటల్ లో పీజీఐ రోహ్​తక్ వైద్యుల బృందం సమక్షంలో ఆయన వ్యాక్సిన్ వేయించుకున్నారు.మరోవైపు, దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో చేస్తోన్న ఈ ప్రయోగ పరీక్షల్లో 26 వేల మంది వాలంటీర్లు పాలుపంచుకుంటున్నారు. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమైనట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది.

ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘కరోనా’ ! : ఓటు వేయమంటూ..అభ్యర్థన!!


భారత వైద్య పరిశోధన మండలిశ(ఐసీఎంఆర్​) సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ కోసం దేశంలో భారత్​ బయోటెక్​ చేపడుతోన్న అతిపెద్ద క్లినికల్​ పరీక్ష ఇదే కావడం విశేషం. కాగా, మూడో దశ ప్రయోగాలు విజయవంతమైతే అతి త్వరలోనే టీకాను ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *