లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

ఏడేళ్లుగా కూతురిపై తండ్రి అత్యాచారం..నా చెల్లెలినైనా రక్షించండీ అంటూ బాధితురాలి వేడుకోలు

Published

on

Haryana fadher rapes 17 year old daughter : కన్నతండ్రే..కుమార్తెపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. ఏదోమద్యం మత్తులో జరిగిన ఘోరం కాదిది. గత ఏడేళ్లుగా ఆ తండ్రి కూతురిపై అత్యాచారాలకు తెగబడుతునే ఉన్నాడు.తండ్రి చేసిన ఘోరానికి ఆ 17ఏళ్ల బాలిక ఎన్నో సార్లు గర్భం దాల్చింది. కానీ తన కామపు కోర్కెలకు అడ్డు వస్తుందని ఎన్నో సార్లు గర్భస్రావం చేయాంచాడా మృగంలాంటి తండ్రి. ఏడేళ్లుగా తండ్రి పెట్టి అత్యంత దారుణ హింసలను భయంతో భరించీ..భరించీ ఇక సహించలేక ఎట్టకేలకూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ ఘోరమైన ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగి వద్ద పనిచేసే ఆ తండ్రి గత ఏడేళ్లుగా తన కూతురిపై అత్యాచారానికి పాల్పడుతునే ఉన్నాడు. ఈ ఘారానికి ఫలితంగా బాధితురాలు ఎన్నోసార్లు గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ప్రతీసారీ అబార్షన్ చేయించేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని..నీకు ఎంతో ఇష్టమైన చెల్లిని కూడా చంపేస్తానని దారుణంగా కొట్టి మరీ బెదిరించేవాడు. దీంతో తనచెల్లెలి కోసం అన్నింటినీ భరించింది. కానీ ఆ కామాంధపు తండ్రి కళ్లు తన చెల్లెలిమీద కూడా పడటంతో ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని ఏడేళ్ల నుంచి నరకాన్ని అనుభవించిన బాధితురాలు హిసార్‌లో మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

తన తండ్రి దారుణాలు తనతోనే ఆగలేదనీ..తన 11 ఏళ్ల చెల్లెలిపై కూడా తండ్రి వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో తెలిపింది. నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. దయచేసిన నా చెల్లెలి జీవితాన్నైనా కాపాడండీ అంటూ పోలీసుల్ని వేడుకుంది.

బాధితురాలి ఫిర్యాదుతో ఆమె తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376(2), 376(2) f, 313, 323, 354-A(1)ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు మైనర్ కావడంతో నిందితుడిపై పొక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశామని.. అతడిని విచారస్తున్నామని వెల్లడించారు.