ఎంత కామెడీనో.. ‘ఇడియట్’ ట్యూన్ లేపేశారు!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hasina Pagal Deewani from Indoo Ki Jawani: బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ లేటెస్ట్ మూవీ ‘ఇందూకి జవానీ’. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అభీర్‌సేన్‌ గుప్తా డైరెక్ట్‌ చేస్తున్నారు. మికా సింగ్‌ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను బుధవారం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.


సారా, రకుల్‌లకు సమన్లు పంపలేదు.. ఎన్‌సిబి క్లారిటీ!


‘హసీనా పాగల్ దివాని..’ అంటూ సాగే ఈ పెప్పీ సాంగ్‌లో కైరాతో పాటు ఆదిత్య సియల్‌ ఆడిపాడాడు. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ రాయగా.. మికా సింగ్, ఆషీష్ కౌర్ పాడారు. ఈ సాంగ్‌ బాలీవుడ్‌ సినీ ప్రేక్షకులకు కొత్తగా ఉందేమో కానీ.. టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు..


ఎందుకంటే రవితేజ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ‘ఇడియట్‌’ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..’ ట్యూన్‌ను మక్కీకిమక్కీ లేపేశారు. ఈ సాంగ్‌ విన్న టాలీవుడ్‌ సినీ జనాలు.. ఇప్పుడు టాలీవుడ్‌ కంటెంట్‌పై ఆధాపడుతున్న బాలీవుడ్‌‌కు.. ట్యూన్స్‌ విషయంలోనూ టాలీవుడ్‌పైనే డిపెండ్‌ కావాలా? అంటూ కాముంట్స్ చేస్తున్నారు.
ఏదేమైనా ప్రస్తుతం ‘హసీనా పాగల్ దివాని..’ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts