లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రైతు సంఘాల ఆరోపణలపై సుప్రీం అసంతృప్తి

Published

on

Supreme Court నూతన వ్యవసాయ చట్టాల వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాతంగా ఉందని రైతుల సంఘాలు ఆరోపించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిటీని మధ్యవర్తిత్వం కోసమే ఏర్పాటు చేశామని, ఎలాంటి న్యాయాధికారమూ కమిటీకి లేదని తెలిపింది. ఇందులో పక్షపాతానికి తావులేదని స్పష్టం చేసింది. తాము నిపుణులం కానందు వల్లే కమిటీలో నిపుణులను నియమించినట్లు వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు నియమించిన కమిటీని పునర్నియమించే విషయంలో సీజేఐ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి నోటీసు ఇచ్చింది. సుప్రీం నియమించిన కమిటీ సభ్యుల్లో ఒకరు తప్పుకున్నందున కమిటీని పునర్నియమించాలని దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపింది.

మరోవైపు, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు, గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26న చేపట్టబోయే ట్రాక్టర్ ర్యాలీపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. ట్రాక్టర్​ ర్యాలీ లేదా మరే ఇతర నిరసనలకు వ్యతిరేకంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ఢిల్లీ పోలీసులే అని సృష్టం చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్​ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. దీంతో అఫిడవిట్​ను కేంద్రం ఉపసంహరించుకుంది.