మీ ఫోన్ రేడియేషన్, IMEI నెంబర్లు చెక్ చేయడం తెలుసా?

Have you checked Your Smartphone Radiation, otherwise your health in danger

మీ స్మార్ట్ ఫోన్ రేడియేషన్ స్థాయి ఎంత ఉందో తెలుసా? ప్రతి ఫోన్ కు రేడియేషన్ ఒక్కో స్థాయిలో ఉంటుంది. మీరు వాడే ఫోన్‌కు రేడియేషన్ స్థాయి ఎంత ఉందో వెంటనే చెక్ చేసుకోండి. రేడియేషన్ అంటే ఏంటో తెలియనివారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. రేడియేషన్ లేదా SAR వాల్యూ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కొత్త స్మార్ట్ ఫోన్ కొనే ముందు ప్రతిఒక్కరూ చెక్ చేయాల్సింది రేడియేషన్ లెవల్ ఎంత ఉంది? అప్పుడే ఆ ఫోన్ కొనాలా? వద్దా? అని డిసైడ్ చేసుకోవాలి. కొన్ని స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లు తమ యూజర్ మాన్యువల్ ల్లోనే SAR రేటింగ్ ఎంతో ప్రస్తావిస్తాయి.

స్మార్ట్ ఫోన్ అధికారిక వెబ్ సైట్లో కూడా తమ ప్రొడక్టుకు సంబంధించి SAR వాల్యూ ఎంత ఉందో రివీల్ చేస్తాయి. సాధారణంగా ప్రతి ఫోన్‌లో రేడియో ఫ్రిక్వెన్సీ ట్రాన్స్ మిటింగ్ డివైజ్ ఉంటుంది. కొత్త స్థాయిలో రేడియేషన్ బయటకు రిలీజ్ అవుతుంది. ఈ రేడియేషన్ కారణంగా ఆ ఫోన్ వాడేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రేడియేషన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్టే. స్మార్ట్ ఫోన్లో రేడియేషన్ లెవల్ ఎంత ఉందో తెలుసుకోండి. రేడియేషన్ లెవల్ మీ ఫోన్లలో ఇలా చెక్ చేసుకోవచ్చు.  

SAR Value చెకింగ్ ఇలా :
* మీ స్మార్ట్ ఫోన్ Unlock చేయండి.
* మీ ఫోన్ Dialer Keypad ఓపెన్ చేయండి.
* ఇప్పుడు *#07# అని టైప్ చేయండి.
* మీ స్మార్ట్ ఫోన్ స్ర్కిన్‌పై SAR రేటింగ్ వాల్యూ కనిపిస్తుంది.
* రేడియేషన్ స్థాయి 1.6w/kg (Body, Head) కంటే తక్కువ స్థాయిలో ఉంటే పర్వాలేదు.
* మీ ఫోన్ వాడొచ్చు. ఎలాంటి ప్రమాదం లేదు.
* ఎక్కువ స్థాయిలో రేడియేషన్ ఉంటే మాత్రం తక్షణమే ఆ ఫోన్ వాడకం ఆపేయండి.

IMEI నెంబర్లు చెకింగ్ :
* IMEI నెంబర్లు సహా ఇతర విషయాలను కూడా చెక్ చేయొచ్చు.
* మీ డయలర్ ప్యాడ్ పై *#06# అని టైప్ చేయండి.
* స్మార్ట్ ఫోన్ స్ర్కిన్ పై ఆటోమాటిక్ గా IMEI నెంబర్లు కనిపిస్తాయి.

Read : మీ ఐఫోన్‌‌ స్లో అయిందా? Cache ఇలా క్లియర్ చేయండి!

మరిన్ని తాజా వార్తలు