లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పండుగ ఆఫర్లు: స్మార్ట్ టీవీలకు ఈజీగా లోన్లు

Published

on

HDFC Bank takes its 'Festive Treats' to rural areas of nation

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఫెస్టివ్ ట్రీట్స్ ఆఫర్ల పేరిట కస్టమర్లకు మరింత దగ్గర అయ్యేందుకు నిర్ణయం తీసుకుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. గ్రామీణ బాట పట్టడంలతో భాగంగా నూతన పాలసీలను ప్రకటించింది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. వ్యాపారం కోసం లోన్ తీసుకోవాలని భావించే వారు, కొత్తగా టీవీ కొనాలనుకునేవారు వారి ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా లోన్ పొందవచ్చని బ్యాంకు ప్రకటించింది. 

ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్ల(సీఎస్‌సీ)లో రిజిస్టర్ చేసుకున్న1.2లక్షల గ్రామ స్థాయి ఎంట్రప్రెన్యూర్ల (వీఎల్ఈఎస్) నెట్‌వర్క్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రామీణ ప్రాంతాలలో కస్టమర్లకు ఫెస్టివ్ ట్రీట్స్  అందించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పాలసీ ద్వారా రుణాల దగ్గరి నుంచి సేవింగ్స్ అకౌంట్ల వరకు కస్టమర్లు ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చు. అంతేకాదు వెయ్యికి పైగా బ్రాండ్ల డిస్కౌంట్ లభిస్తుంది.

గ్రామాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని కస్టమర్లకు ఫెస్టివ్ ట్రీట్స్ ఆఫర్లు అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కంట్రీ హెడ్ అరవింద్ వోహ్ర వెల్లడించారు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బ్యాంక్ సేవలు కస్టమర్లకు అందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎస్‌సీ ఎస్‌పీవీ సీఈవో దినేశ్ త్యాగి తెలిపారు. కస్టమర్లు దగ్గరిలోని సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి హెచ్‌డీఎఫ్‌సీ ఫెస్టివ్ ఆఫర్లను పొందొచ్చని పేర్కొన్నారు

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *