ఆసుపత్రిలో చేరి 42 రోజులు.. 19సార్లు కరోనా పాజిటివ్.. ఒక్క లక్షణం కూడా లేదు

ఇప్పటివరకు మనం వింటున్నదే ఇది.. అయితే ఈ రకమైన కరోనా కేసులు చాలా ప్రమాదం అని చెబుతుంది WHO కూడా.. వైరస్ వేగంగా విస్తరించేందుకు ఇది కారణం అవుతున్నట్లుగా చెప్తున్నారు.

ఆసుపత్రిలో చేరి 42 రోజులు.. 19సార్లు కరోనా పాజిటివ్.. ఒక్క లక్షణం కూడా లేదు

ఇప్పటివరకు మనం వింటున్నదే ఇది.. అయితే ఈ రకమైన కరోనా కేసులు చాలా ప్రమాదం అని చెబుతుంది WHO కూడా.. వైరస్ వేగంగా విస్తరించేందుకు ఇది కారణం అవుతున్నట్లుగా చెప్తున్నారు. లేటెస్ట్‌గా మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఓ మహిళలో దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఏమీ లేకుండా.. కరోనా వైరస్ ఉన్నట్లుగా గుర్తించారు. ఒకటి, రెండు సార్లు కాదు ఏకంగా 19 సార్లు పరీక్షించినా కూడా ఆమెకు పాజిటివ్ అని తేలింది.

కేరళలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన 62 ఏళ్ల మహిళ ఫిబ్రవరి నెలలో ఇటలీ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆ తరువాత మామూలుగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమెకు ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ అని వస్తుండడంతో ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు డాక్టర్లు. ఆమెకు ఇస్తున్న కాంబినేషన్ డ్రగ్స్‌ను మార్చి చూసినా ఫలితం కనిపించట్లేదని శరీరం నుంచి కరోనా తగ్గట్లేదని చెబుతున్నారు.

ఆమె ఆసుపత్రిలో చేరి 42 రోజులు అయ్యిందని, ల‌క్ష‌ణాలు లేవన్న కారణంతో మాత్రం ఆమెను డిశ్చార్జ్ చేయబోమని స్పష్టం చేశారు డాక్టర్లు. ఆమెను కోజెన్ ‌చేరి హాస్పిట‌ల్‌కి త‌ర‌లిస్తామని, ప‌రిస్థితి ఇలాగే ఉంటే కొట్టాయం మెడిక‌ల్ కాలేజి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడే విడిగా ఉంచుతామని డాక్టర్లు చెప్పారు.