కరోనా వైరస్ 12 రకాల లక్షణాలివే…

దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో...ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

కరోనా వైరస్ 12 రకాల లక్షణాలివే…

దగ్గు, జలుబు, జ్వరమే కాదు..గొంతునొప్పి కూడా కరోనా లక్షణమేనా ? విరోచనాలు, తలనొప్పి, వికారం వచ్చినా..అదేనేమో…ఇలాంటి..అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎవరైనా దగ్గినా, తుమ్మినా..అదో విధంగా చూడడం కామన్ అయిపోయింది. కొంతమందిలో వైరస్ లక్షణాలు కనిపిస్తుంటే..మరికొందరిలో ఇలాంటి లక్షణాలు  కనిపించకుండానే..వైరస్ వస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే..ఈ వైరస్ వచ్చి ఉంటుందని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుందని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా సోకిందోమో తెలుసుకొనేందుకు 12 రకాల లక్షణాలను ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి శరీరంలో మార్పులు గమనించింది. ఇలాంటి లక్షణాలు ఎంత శాతం మందిలో కనిపిస్తున్నాయో లెక్క తేల్చింది. జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలే కాకుండా..అలసట, విరేచనాలు, తలనొప్పి వంటివి కూడా..ఉన్నాయని తేల్చింది.

కరోనా లక్షణాలు : జ్వరం (88 శాతం), పొడి దగ్గు (68 శాతం), అలసట (38 శాతం), శ్లేష్మ దగ్గు (33 శాతం), శ్వాస సమస్య (19 శాతం), గొంతు నొప్పి (14 శాతం), తలనొప్పి (14 శాతం), కండరాల నొప్పి (15 శాతం), చలి (11 శాతం), వికారం (5 శాతం), ముక్కులో ఇబ్బంది (5 శాతం), విరేచనాలు (4 శాతం)