దోమలు కూడా కరోనాను వ్యాప్తి చేస్తాయా..

దోమలు కూడా కరోనాను వ్యాప్తి చేస్తాయా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 2.5 మిలియన్ మార్క్‌కు చేరుకుంది. అందులో లక్షా 80వేలకు పైగా చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చూడనంతగా కరోనా మహమ్మారి నష్టం చేకూర్చింది. వైరస్ గురించి అందిన కొత్త సమాచారాన్ని బట్టి ప్రతి రోజూ ఏదో ఒక కొత్త వ్యక్తిలో వైరస్ లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ నిర్ధిష్టమైన మందు కనిపెట్టకపోవడంతో పెరుగుతున్న కేసుల్తో వైద్యులు తలలు పట్టుకుంటుననారు.

టెస్టింగ్ చేయించుకోవడానికి ముందే తప్పుడు సమాచారం, రూమర్లతో సాధారణ జలుబుకు కూడా కరోనా అనుమానాన్ని  వ్యక్తం చేస్తూ టెస్టింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. WHOతో పాటు వైద్య నిపుణులు, ప్రొఫెషనల్స్ సలహా మేరకు లక్షణాలను బట్టే కరోనా టెస్టులకు రావాలని అంటున్నారు. వారందరి భయం ఏ వ్యక్తిని తాకకపోయినా దోమలు కుట్టడం ద్వారానూ కరోనా వైరస్ సంక్రమిస్తుందా.. అనే సందేహాలు మొదలయ్యాయి. అసలు నిజమేంటో తెలుసుకుందాం.

WHO సమాచారం ప్రకారం.. దోమలు కుట్టడం ద్వారా కొన్ని వైరస్ లు మనిషి శరీరంలోకి ప్రవేశించడం నిజమే. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తిని కుట్టిన దోమ ఆరోగ్యవంతుని కుట్టడంతో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఇలా జికా వైరస్, డెంగ్యూ జ్వరాలు చూసి ఉన్నాం. వివిధ రకాల దోమలు కుట్టి వచ్చే వైరస్ లలో కరోనా వైరస్ ఉందనే విషయాన్ని ఇప్పటి వరకూ ఏ టెస్టూ బయటపెట్టలేకపోయింది.

‘ఈ రోజు వరకూ దోమలు కుట్టడం ద్వారా కరోనా వైరస్ సోకినట్లు ఏ సమాచారం లేదు. కరోనా వైరస్ అనేది శ్వాస సంబంధిత వైరస్. ఇది నీటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా, అతని సెలైవా మన మీద పడినా, ముక్కులో నుంచి నీరులా కారి ఇతరులకు తాకినా వైరస్ వస్తుంది. దీని నుంచి కాపాడుకోవడానికి చేతులు తరచూ కడుక్కుంటూ ఉండటం, ఆల్కహాల్ తో చేసిన శానిటైజర్ కానీ, సబ్బు నీటితో కాని శుభ్రం చేసుకోవాలి. తుమ్ముతున్నా, దగ్గుతున్నా ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్లాలి’ అని WHO చెప్తుంది.

అలా అని దోమల్ని తేలిగ్గా తీసుకోవద్దు. దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, లాంటి వ్యాధులకు మార్చి, ఏప్రిల్ లు మంచి సీజన్. నొవల్ కరోనా వైరస్ కోసం జాగ్రత్తలు పాటించేటప్పుడు ఇంటి పరిసరాల్లో దోమలు కూడా లేకుండా చేసుకోవడం ఉత్తమం.