corona virus:పారిశుద్ద్య కార్మికులకు సోకిన కరోనా

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార

corona virus:పారిశుద్ద్య కార్మికులకు సోకిన కరోనా

corona virus:దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార్మికులకు కరోనా వైరస్ సోకింది.  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేసే 39 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది.

దీంతో ప్రభుత్వం, అధికారులు ఉలిక్కిపడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన అందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కు తరలించారు. అయితే వారు ఎవరెవరినీ కలిశారో గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి, కరోనా నియంత్రణకు పని చేస్తున్న పోలీస్ సిబ్బందితో పాటు పలువురు జర్నలిస్టులకు కూడా కరోనా సోకుతుండటం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.